సిట్‌కు బండి భగీరథ లేఖ
x
Bandi Bhageerath

సిట్‌కు బండి భగీరథ లేఖ

తగిన ఆధారాలతో 15వ తేదీన విచారణకు హాజరవుతానని చెప్పాడు


పోక్సో కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారులకు బండి భగీరథ బుధవారం సాయంత్రం లేఖ రాశారు. ఈరోజు మధ్యాహ్నం 2గంటలకు భగీరథ సిట్ విచారణకు హాజరుకావాల్సుంది. పేట్ బషీరా బాద్ పోలీసుస్టేషన్లో విచారణకు కావాలని మంగళవారమే సిట్ అధికారులు భగీరథకు నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు విచారణకు భగీరథ హాజరుకాలేదు. సాయంత్రం సిట్ అధికారులకు రాసిన లేఖలో 15వ తేదీన విచారణకు హాజరవుతానని చెప్పాడు.

తాను నిర్దోషిని అని నిరూపించుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్లు, సమాచారాన్ని తీసుకొస్తానని చెప్పాడు. ఇవి సంపాదించేందుకు తనకు కొంత వ్యవధి కావాలని చెప్పిన భగీరథ తగిన ఆధారాలతో 15వ తేదీన విచారణకు హాజరవుతానని చెప్పాడు. తనపైన, తన కటుంబంపైన వచ్చిన ఆరోపణలన్నీ తప్పుడువే అని తన లేఖలో పేర్కొన్నాడు. నిష్పాక్షిక దర్యాప్తు కోసం రెండు రోజుల సమయం ఇవ్వాలని నిందితుడు సిట్ అధికారులను కోరాడు.

తనపై భగీరథ లైంగిక దాడి చేశాడని 15 ఏళ్ళ మైనర్ బాలిక పేట్ బషీరా బాద్ పోలీసుస్టేషన్లో ఈనెల 8వ తేదీన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బాలిక మైనర్ కావటంతో అందులోను లైంగిక ఆరోపణలు చేయటంతో పోలీసులు భగీరథపైన పోక్సో కేసు నమోదుచేశారు. తనపైన పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారని తెలియగానే నిందితుడు బాలికతో పాటు అమ్మాయి తల్లిపైన హనీట్రాప్, డబ్బులకోసం బెదిరింపు ఫిర్యాదులు చేశాడు. దాంతో ఒక కేసును పేట్ బషీరాబాద్ పోలీసులు మరో కేసును కరీంనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనపైన కేసు నమోదైన దగ్గర నుండి నిందితుడు మొబైల్ ఫోన్ ను స్విచ్చాఫ్ చేసుకుని పరారీలో ఉన్నాడు. పరారీలో ఉన్నాడు కాబట్టే నిందితుడిపై అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి 15వ తేదీన హాజరయ్యే విచారణలో నిందితుడు ఎలాంటి ఆధారాలను చూపిస్తాడో చూడాలి.

Read More
Next Story