
వేసవిలో బీర్‌కు పెరిగిన గిరాకీ..
ఎండదలు మండుతున్నాయి. బయటకు వెళ్లాలంటే భయమేసేలా ఉంది పరిస్థితి. వాతావరణ శాఖ కూడా ఎండల విషయంలో కీలక హెచ్చరికలు చేస్తోంది. కాగా తెలంగాణలో ఎండలు పెరుగుతున్న కొద్దీ బీర్‌కు గిరాకీ కూడా అంతే పెరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో బీర్ అమ్మకాలు ఆకాశాన్నంటుతున్నాయి. 57 రోజుల్లో రూ.118 కోట్ల బీర్ అమ్మకాలు జరిగాయంటే బీర్‌కు ఉన్న గిరాకీ ఏంటో అర్థమవుతోంది. ఇది రాష్ట్రవ్యాప్తంగా నమోదైన అమ్మకాలు కాదు.. కేవలం మూడు జిల్లాల్లో నమోదైనవే. మామూలు రోజుల్లో విస్కీ, బ్రాంది, వోడ్కా, రమ్ వంటి వాటికి కూడా మంచి గిరాకీ ఉండేది. కానీ వేసవి తాపం పెరుగుతుండటంతో మందుబాబులు.. వాటిని సేవించడం తగ్గించి బీర్ వైపు మొగ్గు చూపుతున్నారు.
కరీంనగర్ మద్యం డిపో నుంచి కరీంనర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు బీర్ సరఫరా జరుగుతుంది. మూడు జిల్లాల్లో ఉన్న 192 వైన్ షాపులు, 58 బార్లకు ఈ డిపో నుంచే మద్యం అందుతుంది. ఈ డిపోలో మార్చి 1 నుంచి ఏప్రిల్ 26 వరకు మొత్తం 5,82,166 బీర్ కాటన్‌లు అమ్ముదయ్యాయి. అంటే ఈ 57 రోజుల్లో అమ్ముడయిన బీరు విలువ రూ.118.56 కోట్లు. ఇది మద్యం డిపో నంచి రిటైల్ షాపులు కొనుగోలు చేసిన విలువ. ఈ మొత్తానికి మరో 20శాతం మార్జిన్ ఛార్జీలు కలుపుకుని వైన్ షాపులు, బార్లు కస్టమర్లకు మద్యాన్ని అమ్ముతుంది. అంటే 20శాతం మార్జిన్‌తో అమ్మకాలు జరిగాయనుకున్నా 57రోజుల్లో రిటైల్ షాపులను కొనుగోలు చేసిన బీర్లను మొత్తం రూ.146.272 కోట్లకు అమ్ముతుంది.

