దేశాభివృద్ధికే ప్రధాని పొదుపుసూత్రాలు
x

దేశాభివృద్ధికే ప్రధాని పొదుపుసూత్రాలు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు


విదేశీ మారక నిల్వలను ఆదా చేసుకునేందుకు బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని, విదేశీ ప్రయాణాలకు దూరంగా ఉండాలని ప్రధాని చేసిన విజ్ఞప్తి ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామ్ చందర్ రావు సమర్ధించారు. మంగళవారం తెలంగాణా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ప్రధాని తెలంగాణలో పర్యటించినప్పుడు చేసిన వాఖ్యలను ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్తుతుల్లో బంగారం కొనుగోలు చేయ కూడదు, విదేశీ ప్రయాణాలను మానుకోవాలని ప్రధాని చేసిన విజ్ఞప్తి వల్ల మన దేశ ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందని రామ్ చందర్ రావు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంధన, రేషనింగ్ వల్ల పెరుగుతున్న ధరలను తగ్గించుకోవడానికి ప్రధాని తెలంగాణ పర్యటనలో పొదుపు సూత్రాలు చెప్పారని రామ్ చందర్ రావు అన్నారు. ప్రస్తుతం దేశం ఆర్థిక సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ఆయన అన్నారు.

సంక్షోభం లేనిసమయంలో బియ్యం ఒక్కసారే కొనుగోలు చేయాలని, ప్రజలు ఒక్కపూటే భోజనం చేయాలని కాంగ్రెస్ పార్టీ చేసిన విజ్ఞప్తిని రామ్ చందర్ రావు తప్పు పట్టారు.

1960 దశకం లో ఇండో పాక్ యుద్ధ సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి దేశ ప్రధానిగా ఉన్నప్పుడే సంక్షోభం వచ్చినప్పుడు ప్రజలు బియ్యం ఒక్కసారే కొను గోలు చేయాలి, ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం కోరిన విషయాన్ని రామ్ చందర్ రావు గుర్తు చేశారు.

తెలంగాణా సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని ప్రసంగిస్తూ దేశం కోసమే ప్రధాని పొదుపు సూత్రాలను వెల్లడించినట్టు ఎన్ .రామ్ చందర్ రావు పేర్కొన్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యలను బీజేపీ అధ్యక్షుడు తప్పు పట్టారు.

ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎదురైన సంక్షోభాలను వారి మంత్రులు , నాయకులు పున సమీక్షించుకోవాలని రామ్ చందర్ రావు సూచించారు.

స్వదేశీ ఉత్పత్తులను వినియోగించుకోవాలని, , వంట నూనె వినియోగాన్ని తగ్గించుకోవాలని, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ప్రధాని వాఖ్యలు చేసిన నేపథ్యం లో బీజేపీ అధ్యక్షుడు ఈ వాఖ్యలు చేశారు.

రసాయన ఎరువుల దిగుమతులకు విదేశీ మాదక ద్రవ్యాన్ని గణనీయంగా ఖర్చు అవుతుందని రామ్ చందర్ రావు అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించడం వల్ల ఇంధన చార్జీలను గణనీయంగా తగ్గించుకోవచ్చని ప్రధాని చేసిన సూచన బీజేపీ అధ్యక్షుడు గుర్తు చేశారు.

Read More
Next Story