ఆర్టీసీ కార్మికుల తరపున బీజేపీ పోరాడుతుంది
x

ఆర్టీసీ కార్మికుల తరపున బీజేపీ పోరాడుతుంది

ఆర్టీసీ సమ్మె తీవ్రతరం. బీజేపీ మద్దతు, కార్మికుల ఆందోళనలు, ప్రభుత్వం చర్చలు—పరిస్థితి ఉత్కంఠగా మారింది.


తెలంగాణా వరంగల్ జిల్లా ముత్తోజి పేట డిపోకు చెందిన ఆర్ టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్య దరిమిలా ప్రతి పక్ష బీజేపీ ఆందోళన బాట పట్టింది. ఆ పార్టీ చీఫ్ రామ్ చందర్ రావు హైద్రాబాద్ లోని ముషీరాబాద్ ఆర్టీసీ బస్ భవన్ కు చేరుకొని ఆర్టీసీ ఉద్యోగులు , కార్మికులకు సంఘీభావం తెలిపారు .గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆర్టీసి కార్మికుల ప్రయోజనాలు కాపాడుతానని అప్పటి పీసీసీ అధ్యక్షుడు అయిన రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ ఆ దిశగా గత రెండున్నర ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయలేదని ఆయన ఆరోపించారు.శంకర్ గౌడ్ చావుకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యుడు అని రామ్ చందర్ రావు అన్నారు. నర్సం పేటకు డిపో కి చెందిన శంకర్ గౌడ్ మృతికి రామ్ చందర్ రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు .

కాగా శంకర్ గౌడ్ డెడ్ బాడీని నర్సం పేట డిపోకు తరలించడానికి ఆర్టీసీ కార్మికులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మూడోరోజు సమ్మెలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వివిధ జిల్లాల ఎస్పీ ల పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆర్టీసీ కార్మికులు ఎవరుకూడా అధైర్య పడి ఆత్మహత్యలు చేసుకోవద్దని , ఆత్మహత్యలు సమస్య పరిష్కారానికి మార్గం కాదని రామ్ చందర్ రావు సూచించారు. కార్మికుల తరపున బీజేపి ఎల్లవేళలా పనిచేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

సమ్మెకు సంఘీభావంగా బీజేపీ శ్రేణులు వివిధ డిపోలకు చేరుకొని మద్దత్తు తెలపాలని పార్టీ అధ్యక్షుడు అయిన రామ్ చందర్ రావు ఇచ్చిన పిలుపుకు బీజేపి శ్రేణులు స్పందించాయి.

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ మైత్రి హోటల్ చేరుకుని కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు . గత ఎన్నికలముందు ఆర్టీసీ కార్మికుల తరపున పోరాడుతానని చెప్పిన రేవంత్ రెడ్డి ఆర్టీసి కార్మికుల 32 డిమాండ్లను పరిష్కరించలేదన్నారు. రెండున్నర ఏళ్ల పాలనలో రేవంత్ రెడ్డి ప్ర జా వ్యతిరేకతను ముఠా గట్టుకున్నారని బండి సంజయ్ అన్నారు, అనంతరం ఆయన కరీం నగర్ నుంచి నర్సం పేటకు చేరుకుని ఆందోళన చేస్తున్న ఆర్టీసి కార్మికుల తరపున పోరాడుతానని హామీ ఇచ్చారు.

కండెక్టర్లు లేకుండానే ...

తెలంగాణలో ఆర్టీసీ చేపట్టిన సమ్మె నేపథ్యంలో సిబ్బంది కొరతతో కండక్టర్లు లేకుండానే బస్సులు నడి చాయి. మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత ప్రయాణం వెసులు బాటు ఉంది. .కండక్టర్లు లేకుండానే బస్సులు ప్రయాణించడం వల్ల పురుషులు కూడా ఉచితం గానే ప్రయాణం చేయాల్సి వచ్చింది.

ఒక్క హైదరాబాదు లోనే ఆర్టీసి 2,800 బస్సులు నడుపుతోంది.

సందట్లో సడేమియా అన్నట్టు ఆటో డ్రైవర్లు ప్రయాణికుల నుంచి అధిక రేట్లు వసూలు చేశారు అన్న ఆరోపణలు వచ్చాయి.

ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారానికి జేఏసీ ఆరు రోజుల సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే .ఆర్టీసీ జేఏసీ తో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.ఇప్పటికే ఆర్టీసీ వేలాది కోట్లు నష్టపోయిన నేపథ్యంలో సమ్మె విరమించడానికి ప్రభుత్వం పూనుకుంది.

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు .

Read More
Next Story