
అమర వీరుల స్థూపం వద్ద బీజేవైఎం నివాళి
అమరుల ఆశయ సాధనకు బీజేపీ కట్టుబడి ఉందన్న మోర్చా నాయకులు
భారతీయ జనతా యువ మోర్చా తెలంగాణ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, హైదరాబాద్‌లోని గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ప్రత్యేక నివాళి కార్యక్రమం జరిగింది.
తెలంగాణ కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల ఆశయ సాధనకు బీజేవైఎం కట్టుబడి ఉందనే సందేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నామని యువ మోర్చా నాయకులు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయ్యాక పదేళ్ళపాటు అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ గత ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది.
కుటుంబపాలన, అవినీతి పాలనను వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్ అనేక ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని కాంగ్రెస్ పార్టీ రెండున్నర ఏళ్ళక్రితం అధికారంలో వచ్చింది.
తెలంగాణలో అధికారం చేజిక్కించుకుంటామని కళలు గన్న బీజేపీ గత ఎన్నికల్లో చతికిల పడి మూడో స్థానానికి పరిమితమైంది. మరో రెండున్నర ఏళ్ల తర్వాత తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.జూన్ రెండు న తెలంగాణా అవతరణ దినోత్సవం జరుగనుంది. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడావికి బీజేపీ కీలక పాత్ర పోషించిందని బీజేపీ నేతలు చెబుతుంటారు.
మరో మూడు రోజుల్లో తెలంగాణా అవతరణ దినోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. తెలంగాణా కోసం అమరులైన వారిని స్మరిస్తూ యువ మోర్చా నాయకులు శుక్రవారం చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమం అడ్డు కోవాలని పోలీసులు విఫల యత్నం చేసినట్టు బీజేవైఎం నాయకులు ఆరోపించారు.

