Telangana Cabinet Meeting
x

రిటైర్డ్ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

ప్రజాప్రతినిధుల జీతాల్లో 50శాతం కోత. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలకు వేరే మార్గాలు.


రిటైర్డ్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారికి అందాల్సిన ప్రయోజనాలకు సంబంధించిన బకాయిలను చెల్లించడానికి తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. దాదాపు వంద రోజుల్లో వారి బకాయిలు చెల్లించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. అందులో రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీగా పెండింగ్‌లో ఉన్న ఈ బకాయిలను త్వరగా చెల్లించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిధులు సమీకరించాలని మంత్రిమండలి నిర్ణయించింది.

ప్రస్తుతం రెగ్యులర్ ఉద్యోగులకు సుమారు రూ. 6,200 కోట్లు, పదవీ విరమణ చేసిన వారికి సుమారు రూ. 8,000 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త మార్గాలు అన్వేషించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఆర్థిక వనరుల సమీకరణ కోసం కొన్ని ప్రత్యేక ప్రతిపాదనలు కూడా ముందుకు వచ్చాయి. ముఖ్యంగా ప్రజాప్రతినిధుల జీతాల్లో 50 శాతం కోత విధించి, ఆ నిధులను రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపుకు వినియోగించాలనే ప్రతిపాదనకు మంత్రులు సమ్మతి తెలిపారు. ఇది ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.

అదేవిధంగా, నిధుల సమీకరణపై దృష్టి పెట్టిన సబ్ కమిటీ వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని కూడా నిర్ణయించారు. ఈ చర్చల ద్వారా త్వరితగతిన పరిష్కారం కనుగొనే దిశగా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. మొత్తం మీద, రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం సానుకూలంగా ముందుకు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది.

క్యాబినెట్ తీసుకున్న ఇతర నిర్ణయాలు..

ఈ సమావేవంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సుదీర్ఘంగా చర్చించింది. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు.

  • కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు విషయాన్ని మంత్రివర్గ సమావేశం చర్చించింది. జ్యుడీషియల్ కమిషన్ నియామకాన్ని హైకోర్టు తప్పుబట్టలేదని, పైగా కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమని, రాజ్యాంగబద్ధమని కూడా అభిప్రాయపడిందని సమావేశంలో అడ్వకేట్ జనరల్ తీర్పు వివరాలను వెల్లడించారు.
  • ఆ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని దీనిపై న్యాయనిపుణులతో చర్చించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది.
  • అలాగే, రిసోర్స్ మొబిలైజేషన్ కోసం నియమించిన సబ్ కమిటీ వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగ సంఘాలను పిలిచి చర్చలు జరపాలని, ఆర్థిక వనరుల సమీకరణతో పాటు వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరించాలని నిర్ణయించారు.
  • హైదరాబాద్‌లోని గచ్చీబౌలి స్టేడియాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్‌ (#PPP) పద్ధతిలో అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. స్టేడియంకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న 76 ఎకరాల్లో 64 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో 21 రకాల క్రీడలకు సంబంధించిన సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించారు.
  • మంథని నియోజకవర్గ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. అలాగే, మంచిర్యాల జిల్లా హాజీపూర్ రెవెన్యూ పరిధిలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసరాల్లో ఇంటిగ్రేటెడ్ అక్వా పార్క్‌ను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపారు.
Read More
Next Story