
బొద్దింకలకు సీజేపీ లీగల్ హెల్ప్!
కాక్రోచ్ జంతా పార్టీ CJP దేశవ్యాప్తంగా ఉచిత లీగల్ ఎయిడ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. అత్యవసర కేసుల్లో న్యాయవాదుల సాయం కూడా అందుబాటులో ఉంటుంది.
కాక్రోచ్ జనతా పార్టీ తమ సొంత న్యాయసహాయ వెబ్‌సైట్‌ను లాంచ్ చేసింది. రానున్న రోజుల్లో సీజేపీ మద్దతుదార్లు, వాలంటీర్లలో ఎవరికయినా న్యాయపరమైన సహాయం అందించడమే ఈ వెబ్‌సైట్ లక్ష్యం అని సీజేపీ వెల్లడించింది. న్యాయ సమస్య ఎదురైతే ఇక సాయం కోసం ఎక్కువగా వెతకాల్సిన అవసరం లేదని కాక్రోచ్ జంతా పార్టీ తెలిపింది. పార్టీ వాలంటీర్లు, మద్దతుదారుల కోసం దేశవ్యాప్తంగా లీగల్ ఎయిడ్ వెబ్‌సైట్‌ను ఆగస్టు 25న ప్రారంభించింది. కాక్రోచ్ జంతా పార్టీ, CJP, ప్రత్యేక లీగల్ ఎయిడ్ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ వెబ్‌సైట్‌ను CJP లీగల్ అఫైర్స్ హెడ్ రత్నా సింగ్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో వాలంటీర్లు, మద్దతుదారులు న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని CJP తెలిపింది. ఇప్పటికే అందిస్తున్న న్యాయ సహాయాన్ని మరింత సులభంగా అందించేందుకు ఈ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించినట్లు పేర్కొంది. వెబ్‌సైట్‌లో న్యాయసాయం పొందే ప్రక్రియను సులభంగా ఉంచారు. ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత తమ న్యాయ సమస్య, ప్రాంతం వివరాలను నమోదు చేయాలి.
ఆ తర్వాత ధృవీకరించిన న్యాయవాది కేసును తీసుకుని, ప్లాట్‌ఫామ్ ద్వారా సంబంధిత వ్యక్తిని సంప్రదించవచ్చు. అరెస్టు లేదా నిర్బంధం వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యేక ఎమర్జెన్సీ ఆప్షన్ కూడా ఉంది. దీనిని ఉపయోగిస్తే కేసును అత్యవసరంగా గుర్తించి, అందుబాటులో ఉన్న న్యాయవాదులు, CJP సమన్వయ బృందానికి వెంటనే సమాచారం చేరుతుంది. వినియోగదారుల గోప్యతకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. వ్యక్తి తన వివరాలను వెల్లడించే వరకు గుర్తింపును ప్రైవేట్‌గా ఉంచే విధానం ఉంది.
ప్లాట్‌ఫామ్‌లో జరిగే కమ్యూనికేషన్‌కు ఎన్‌క్రిప్షన్, పత్రాల కోసం సురక్షిత స్టోరేజ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సేవ పలు భారతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది. పూర్తిగా ఉచితంగా న్యాయసాయం పొందే అవకాశం కల్పించారు. పారదర్శకత కోసం ప్రతి చర్యకు రికార్డు ఉంటుంది. న్యాయవాదిపై ఏదైనా సమస్య ఉంటే వినియోగదారులు గోప్యంగా ఫిర్యాదు చేయవచ్చు. అవసరమైతే CJP బృందం దానిపై పరిశీలన చేసి, కేసును మరో న్యాయవాదికి అప్పగించగలదు.
తమ నమ్మకాల కోసం నిలబడుతున్న వాలంటీర్లు, మద్దతుదారులకు న్యాయ సహాయం అందుబాటులో ఉండేలా ఈ ప్లాట్‌ఫామ్ ఉపయోగపడుతుందని రత్నా సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ అందించిన సహకారానికి CJP కృతజ్ఞతలు తెలిపింది. న్యాయ సేవల ప్రాప్యత కోసం ఇదే నిబద్ధత ఉన్న ఇతర సీనియర్ న్యాయవాదులు కూడా భవిష్యత్‌లో తమకు మద్దతు ఇవ్వాలని కోరింది. CJP లీగల్ ఎయిడ్ వెబ్‌సైట్ ఈరోజు నుంచే అందుబాటులోకి వచ్చింది. న్యాయవాదులుగా నమోదు కావాలనుకునేవారు, న్యాయ సహాయం కోరేవారు వెబ్‌సైట్ ద్వారా ప్రక్రియను ప్రారంభించవచ్చు.

