
ఆందోళన చేస్తున్న రాహుల్ గాంధీ
మళ్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ ల నిరసన
రాత్రి పోలీసులపైకి రాళ్లు రువ్విన నిరసనకారులు
నీట్ పేపర్ లీక్ పై కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోజ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళన తిరిగి జంతర్ మంతర్ వద్దకు చేరుకుంది. నిన్నటి దాకా కేరళ హౌజ్ వద్ద చేస్తున్న నిరసన.. రాత్రి మళ్లీ జంతర్ మంతర్ వద్దకు చేరుకుంది.
వందలాది నిరసనకారులు అక్కడికి చేరుకున్నారు. రాత్రి సమయంలో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. నిరసనకారులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. అయితే నిరసనకారులు శాంతియుతంగా ఆందోళన చేపట్టాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. తరువాత శాంతియుతంగా ఆందోళన చేశారు.
ఈ రోజు పార్లమెంట్ లో జరిగే చర్చలలో ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ లో ఈ అంశాన్ని లేవనెత్తాయి. సీజేపీ నిరసనకు ప్రతిపక్ష పార్టీలు క్రమంగా తమ మద్దతును తెలుపుతున్నాయి. తాజాగా ఎన్ సీపీ(ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్, ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ సహ పలువురు ప్రతిపక్ష నాయకులు మంగళవారం నాడు జంతర్ మంతర్ ను సందర్శించి సీజేపీకి మద్దతు తెలిపారు.
పార్టీ ఎంపీ సుప్రియా సూలేతో కలిసి వచ్చిన పవార్, గాయపడిన నిరసనకారులను సందర్శించారు. వీరే కాకుండా శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్, అర్వింద్ సావంత్, రాజ్యసభ ఎంపీ మహువా మొయిత్రా, గోపాల్ రాయ్, కేరళ కాంగ్రెస్ (ఎం) నాయకుడు జోస్ కే మణి, వామపక్ష పార్టీల పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. సీజేపీ వ్యవస్థాపకుడు దీప్కే మాట్లాడుతూ.. పార్టీ మద్దతుదారులు వదంతులను నమ్మవద్దని శాంతియుత నిరసనల కోసం జంతర్ మంతర్ వద్దకు మాత్రమే చేరుకోవాలని కోరారు.
దేశంలోని పలు ప్రాంతాలలో ..
ప్రధాని రాజీనామా చేయాలని కోరతూ కాంగ్రెస్ ఎంపీలు ఆయన నివాసం వద్ద మెరుపు ధర్నాకు దిగారు. ఇందులో రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. వీరిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ ప్రాంతం భద్రతాపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతం కావడంతో ప్రతిపక్ష నాయకులు వెంటనే కళ్యాణ్ మార్గ్ ను ఖాళీ చేయాలని ప్రధానమంత్రి కార్యాలయం వెంటనే సహాయమంత్రి జితేంద్ర సింగ్ తో పాటు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ను హుటాహుటిన పంపింది.
వారు రాహుల్ గాంధీతో కొద్దిసేపు మాత్రమే చర్చలు జరిపారు. అయితే అవి అసంపూర్తిగా ముగిశాయి. దీనితో దాదాపు మూడు గంటల పాటు వారు ఆందోళన చేశారు. తరువాత పోలీసులు బలవంతంగా ప్రతిపక్ష నాయకులు అరెస్ట్ చేశారు.
వాంగ్ చుక్ కు మద్దతుగా అమెరికాలో నిరసనలు..
నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని కోరతూ.. దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్ చుక్ కు మద్దతుగా అమెరికాకు చెందిన ఒక న్యాయవాద బృందం కార్యకర్తలు న్యూయార్క్, శాన్ హోసేలలో ప్రదర్శనలు నిర్వహించారు.
హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ కార్యకర్తలు సోమవారం సాయంత్రం న్యూయార్క్ నగరంలోని యూనియన్ స్క్వేర్ వద్ద మహత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసనలు చేశారు. అలాగే లండన్ లోని భారత హైకమిషన్ ముందు, భారత రాయబార కార్యాలయం దగ్గర కూడా ఇలాంటి నిరసన ప్రదర్శనలే జరిగాయి.
Next Story

