
తెలంగాణలో ధర్నాకు కాక్రోచ్ పార్టీ రెడీ..
నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలకు పిలుపునిచ్చింది. తానే స్వయంగా వెళ్లి పలు మెట్రోపొలిటన్ సిటీల్లో ధర్నా చేస్తానని సీజేపీ వ్యవస్థాపకుడు అబిజిత్ దిప్కే వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణలో తమ ధర్నాకు సంబంధించిన వివరాలను సీజేపీ పార్టీ వెల్లడించారు. జూన్ 14వ తేదీ ఉదయం 9:30 గంటలకు ఇందిరాపార్ట్ ధర్నాచౌక్ దగ్గర ధర్నా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా ఈ సమావేశంలో, ధర్నాలో పాల్గొనాలని భావించే వారు రిజిస్ట్రర్ చేసుకోవాలని వెల్లడించారు. ఈ రిజిస్ట్రేషన్ కోసం వాళ్లు ఒక గూగుల్ ఫామ్‌ను కూడా సర్క్యులేట్ చేస్తున్నారు.
ఈ ధర్నా నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్‌కు బాధ్యత వహిస్తే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఆ డిమాండ్‌కు మరింత బలోపేతం చేకూర్చే క్రమంలోనే ఈ ధర్నాలకు పిలుపునిచ్చారు. లక్షల మంది అభ్యర్థుల జీవితాలతో ముడిపడి ఉన్న నీట్ పరీక్ష అంశంలో అత్యంత నిర్లక్ష్యం వ్యవహరించిన కేంద్రమంత్రి రాజీనామా చేయాలంటూ సీజేపీ డిమాండ్ చేస్తున్నారు.

