జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి సీఎం హామీ
x
సీఎంకు వినతిపత్రం అందజేస్తున్న జవహర్ నగర్ డంపింగ్ యార్డు జేఏసీ, ప్రతినిధులు, ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి తదితరులు

జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి సీఎం హామీ

డంపింగ్ యార్డు వివాదంపై కదిలిన ప్రభుత్వం… త్వరలో అఖిలపక్ష సమావేశం


హైదరాబాద్ శివార్లలో తీవ్రంగా వివాదాస్పదంగా మారిన జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్యపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అఖిలపక్ష ప్రతినిధులతో సమావేశమైన సీఎం ఈ నెల 15 తర్వాత రాష్ట్ర స్థాయి అఖిలపక్ష సమావేశం నిర్వహించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.

హైదరాబాద్ నగర శివార్లలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హామి ఇచ్చారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు జేఏసీ అధ్వర్యంలో అఖిలపక్షం సోమవారం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని కలిసి డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించాలని విన్నవించింది. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కు ప్రత్యామ్నాయ యార్డ్ ల నిర్మాణం లో ఆయా ప్రాంతాల నుంచి ప్రతి పక్షాలు, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత ను అధిగమించడానికి ఈ నెల 15 వ తేదీ తర్వాత రాష్ట్ర స్థాయి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కరానికి కృషి చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. సీఎం స్సందించడం జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఉద్యమం లో మంచి పరిణామమని జేఏసీ ప్రతినిధి డాక్టర్ శంకర్ నారాయణ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

విదేశాలలో డంపింగ్ యార్డుల్లో అమలవుతున్న నూతన టెక్నాలజీ పై అవగాహన కలిపించడానికి అఖిల పక్షాన్ని విదేశాలకు పంపిస్తానని సీఎం పేర్కొన్నారు సీఎంను కలిసిన వారిలో జేఏసీ పక్షాన డాక్టర్ బి శంకర్ నారాయణన్,కేతిపల్లి పద్మా చారి,ఏనుగు సంజీవ రెడ్డి,మారం సమ్మి రెడ్ది ,గవిని స్వర్ణ శ్రీనివాస్ ,మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్,మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లా రెడ్ది, డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి,మాజీ మేయర్ మేకల కావ్య,దమ్మాయి గూడ మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్ , డీసీసీ జనరల్ సెక్రటరీ రామా రావులు హైదరాబాద్ జవహర్‌ నగర్ యాంటీ డంపింగ్ యార్డ్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని కలిసి వినతిపత్రం సమర్పించారు. డంపింగ్ యార్డును జవహర్‌ నగర్ నగర్ నుంచి తరలించాలని విజ్ఞప్తి చేశారు.బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతినిధులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.

Read More
Next Story