ఇంటర్ ప్రవేశాలపై రేవంత్ కీలక నిర్ణయం
x

ఇంటర్ ప్రవేశాలపై రేవంత్ కీలక నిర్ణయం

ఇంటర్‌ను పాఠశాల విద్యలో విలీనం చేస్తున్న క్రమంలో రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.


ఇంటర్‌ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియ షురూ అయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఇంటర్ అడ్మిషన్లను యథావిధిగా స్వీకరించాలని, ఈ ఏడాదికి పాత పద్దతినే అనుసరించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అనేక అంశాలను పరిశీలించిన తర్వాతనే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు రేవంత్ పేర్కొన్నారు. ఒకవైపు ఇంటర్ అడ్మిషన్లను ఎక్కువ సమయం లేదని, అదే విధంగా మరోవైపు ఇంటర్, పాఠశాల విద్య విలీనంలో అనేక సాంకేతిక సమస్యలు వస్తుండటంతోనే తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.

సీఎస్ రామకృష్ణరావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి సహా పలువురు అధికారులతో ఇదే అంశంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు రేవంత్ రెడ్డి. అందులో అనేక కోణాల్లో చర్చించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు. విద్యార్థుల ప్రయోజనాలకు ఏమాత్రం విఘాతం ఏర్పడకుండా ప్రవేశాలను చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

డ్రాపౌట్స్ తగ్గే అవకాశం..

అయితే సాధారణంగా చాలా మంది విద్యార్థులు పదోతరగతి తర్వాత చదువుకు స్వస్తి పలుకుతున్నారు. ఆ డ్రాపౌట్స్ తగ్గించడంలో కూడా ఈ విలీనం కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు ఇటీవల సీఎం రేవంత్ సూచించారు. ఇంటర్‌మీడియట్‌ను రద్దు చేసి దానిని కూడా సబీఎస్‌ఈ తరహాలో 11, 12 తరగతులుగా చేర్చాలని, దాని వల్ల పదితో ఆగుతున్న విద్యార్థులు ఈ రెండు తరగతులను కూడా చదివే అవకాశాలు చాలా పెరుగుతాయని అధికారులు సూచించారు. దాని ప్రకారమే ఇప్పుడు తెలంగాణలో ఇంటర్‌ను కూడా పాఠశాల విద్యలో విలీనం చేయడానికి కసరత్తులు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే విలీన ప్రక్రియ ముగిసేవరకు ఇంటర్ అడ్మిషన్లను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా అయితే తమ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో విలీనంతో ముడిపడి ఉన్న అనేక సాంకేతిక సమస్యలను కూడా పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉండటంతో ఈ ఏడాది ఇంటర్ అడ్మిషన్లను యథావిధిగా కొనసాగించాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలని కూడా రేవంత్ రెడ్డి తెలిపారు.

Read More
Next Story