
జ్ఞానేష్ కుమార్ రాజీనామా.. కదం తొక్కిన కాంగ్రెస్
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్‌లో నిరసన చేపట్టారు. ఓటర్ల జాబితాపై స్పష్టత కోరారు.
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సోమవారం నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధి విగ్రహం దగ్గర నుండి కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు భారీ నిరసన ప్రదర్శన చేసింది. ఈ ప్రదర్శనకు పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వం వహించారు. నిరసన ప్రదర్శనలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ధర్మాన శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు. బీజేపీకి తొత్తుగా పనిచేస్తున్న వ్యక్తి చీఫ్ ఎన్నికల కమిషనర్ లాంటి కీలక పదవిలో కొనసాగకూడదంటూ గట్టిగా నినాదాలిచ్చారు. ఏఐసీసీ పిలుపు మేరకు జరిపిన నిరసన ప్రదర్శనలో వేలాదిమంది కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాలో నుంచి ఎందుకు మాయమయ్యాయో ఈసీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
SIR ప్రక్రియలో అక్రమాలు, ఆవకతావకలపై కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం నుండి బషీర్ బాగ్ లోని ఎన్నికల సంఘం కార్యాలయం వరకు భారీ… pic.twitter.com/nV29dgguWZ
— Telangana Congress (@INCTelangana) September 28, 2026ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని కోరారు. ఓటర్ల జాబితా సవరణపై పూర్తి వివరాలు వెల్లడించాలని అన్నారు. ఓటర్ల జాబితా సవరణలో జరిగిన లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. సీఈసీ చేసిన అక్రమాలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం స్వతంత్ర వ్యవస్థగా, పారదర్శకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రులు పేర్కొన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, ఓట్ల చోరీ, సీట్ల చోరీ జరుగుతోందని ఆయన ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజాస్వామ్యాన్ని ఖూనిచేస్తున్నారని కూడా ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం పెరగాలంటే పారదర్శకత చాలా అవసరమని కాంగ్రెస్ నేతలు అన్నారు. ఓటర్ల జాబితా సవరణపై వచ్చిన అనుమానాలకు ఈసీ వివరణ ఇవ్వాలని కోరారు. అర్హులైన ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.

