పోలీసు బాస్‌గా సీవీ ఆనంద్: కొత్త దిశలో తెలంగాణ పోలీసింగ్
x
తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్

పోలీసు బాస్‌గా సీవీ ఆనంద్: కొత్త దిశలో తెలంగాణ పోలీసింగ్

క్రికెటర్ నుంచి డీజీపీ వరకూ… సీవీ ఆనంద్ స్ఫూర్తిదాయక ప్రయాణం


తెలంగాణ రాష్ట్ర పోలీసు వ్యవస్థకు కొత్త నాయకత్వం రానుంది. 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న బి. శివధర్ రెడ్డి పదవీ విరమణకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. అనుభవం, ఆధునిక దృష్టి కలిగిన అధికారిగా గుర్తింపు పొందిన సీవీ ఆనంద్ నేతృత్వంలో తెలంగాణ పోలీసింగ్ మరింత బలోపేతం అవుతుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.

చీఫ్ సెక్రటరీ జీఓ జారీ

తెలంగాణ పోలీసు డైరెక్టర్ జనరల్ గా 1991 ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ ను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ పోలీసు ఫోర్స్ అధిపతిగా ఆనంద్ ను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటు ఆధ్వర్యంలో జీఓఆర్టీ నంబరు 553 పేరిట ఉత్తర్వులు వెలువరించారు. ఢిల్లీలోని యూపీఎస్సీ నిబంధనల ప్రకారం సీవీ ఆనంద్ కు డీజీపీ బాధ్యతలు అప్పగించనునున్నారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్న ఆనంద్ కు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అభినందనలు తెలిపారు.

మరో రెండు రోజుల్లో శివధర్ రెడ్డి పదవీ విరమణ

ప్రస్థుత డీజీపీ బి శివధర్ రెడ్డి ఈ నెల 30వతేదీన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ (C. V. Anand) బాధ్యతలు చేపట్టడం రాష్ట్ర పోలీసింగ్‌లో కీలక పరిణామంగా నిలిచింది.పోలీసుశాఖలో విస్తృత అనుభవం, ఆధునిక దృష్టితో పోలీసింగ్‌కు కొత్త దిశను చూపిన అధికారిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

క్రికెటరు నుంచి సివిల్ సర్వీసు దాకా...

సీవీ ఆనంద్ క్రికెటరుగా రాణించారు. ఈయన ఉన్నత విద్యను పూర్తి చేసి సివిల్ సర్వీసెస్‌లో ప్రవేశించారు. 1991లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)లో ఎంపికై తన సేవలను ప్రారంభించారు. ప్రారంభ దశ నుంచే క్రమశిక్షణ, పనితీరు, నిబద్ధతతో ఉన్నత స్థానాలకు ఎదిగారు.ఈయన తెలంగాణలోని నిజామాబాద్ తోపాటు పలు జిల్లాల్లో ఎస్పీగా పనిచేసి లా అండ్ ఆర్డర్ నిర్వహణలో తన ప్రతిభను చాటుకున్నారు.సైబరాబాద్ పోలీసు కమిషనరుగా పని చేశారు. తర్వాత ఉన్నత పదవుల్లో ఇంటెలిజెన్స్, కౌంటర్ టెర్రరిజం, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వంటి కీలక విభాగాల్లో సేవలందించారు. సీవీ ఆనంద్ప్రత్యేకంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో ట్రాఫిక్ నియంత్రణ, స్మార్ట్ పోలీసింగ్, టెక్నాలజీ వినియోగం వంటి రంగాల్లో వినూత్న మార్పులు తీసుకొచ్చారు.ప్రజలతో స్నేహపూర్వక పోలీసింగ్ విధానం,చట్టవ్యవస్థను సమర్థంగా నిర్వహించడం ఈయన ప్రత్యేకతలు.సీవీ ఆనంద్ తన పదవీకాలంలో పారదర్శకత, సమర్థత, వేగం అనే మూడు ముఖ్య సూత్రాలతో పనిచేస్తూ పోలీసు శాఖ ప్రతిష్ఠను పెంచారు.

డీజీపీగా రెండు రోజుల్లో బాధ్యతలు

డీజీపీగా మరో రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీవీ ఆనంద్ రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, సైబర్ క్రైమ్ వంటి సవాళ్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఆధునిక టెక్నాలజీ వినియోగంతో పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.సాధారణ స్థాయి నుంచి క్రమంగా ఎదిగి రాష్ట్ర పోలీసు విభాగానికి నాయకత్వం వహిస్తున్న సీవీ ఆనంద్ ప్రయాణం యువతకు స్ఫూర్తిదాయకం. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా తీసుకుని ముందుకు సాగుతున్న ఆయన నాయకత్వంలో తెలంగాణ పోలీసింగ్ మరింత బలపడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
Read More
Next Story