ఢిల్లీని ఒపెన్ జైలులా మార్చారు: రాహుల్ గాంధీ
x

ఢిల్లీని ఒపెన్ జైలులా మార్చారు: రాహుల్ గాంధీ

సీఈసీ రాజీనామా చేసే దాక ఆందోళన ఆపమని ప్రకటన


Click the Play button to hear this message in audio format

ప్రధాన ఎన్నికల కమిషనర్ ను ప్రధానమంత్రి రక్షిస్తున్నారని లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. సర్ పై జరుగుతున్న ఆందోళనలను అణచడానికి ఢిల్లీని ఒపెన్ జైలులా మార్చారని ఆరోపించారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే దాక ఉద్యమాన్ని ఆపమని హెచ్చరించారు. నిరసనకారులు ఢిల్లీ రాకుండా ఎందుకు ఆపుతున్నావని ఆయన ప్రశ్నించారు.

ఢిల్లీనే జైలులో పెట్టారు..

ప్రతిఘటన ప్రణాళికబద్దంగా ముందుకు సాగుతోందని రాహుల్ అన్నారు. ‘‘ఇప్పుడు ఇది శివతాండవం. ఇప్పుడు ఎలాంటి ప్రణాళిక లేదు. ప్రస్తుతం అంతా ఆకస్మికంగా జరుగుతోంది. ఆకాశవాణీ భవన్ లో జరిగింది ప్రణాళిక ప్రకారం జరగలేదు. ప్రతిఘటన ఇలాగే జరుగుతుంది. అది ప్రణాళికతో జరగదు’’ అని సుప్రీంకోర్టు వరకూ జరిగే పాదయాత్ర సందర్భంగా ఆయన అన్నారు. నిరసనకారులు గొంతు నొక్కేందుకు మరోసారి ఢిల్లీని లాక్ డౌన్ లో పెట్టారని అన్నారు.
‘‘ఓట్ల దొంగతనానికి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా చలో ఢిల్లీ ప్రజాస్వామ్య యాత్ర నాలుగు ఐదు రోజులుగా ఢిల్లీలో ప్రజా ఉద్యమంగా సాగుతోంది. ఈ ప్రతిఘటన చాలాకాలంగా అంటే పది నుంచి పన్నెండు సంవత్సరాలుగా ఉంది. కానీ ఇది ఇప్పుడు మెల్లగా ఓ రూపు దిద్దుకుంది.
ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే.. ఢిల్లీని ఎందుకు జైల్లో పెట్టారు’’ అని ఆయన అడిగారు. భారీ భద్రతా బలగాలను మోహరించడం ద్వారా మోదీ ప్రభుత్వం నిజంగానే జ్ఞానేశ్ కుమార్ ను కాపాడాలని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు.
‘‘ప్రజలు ఢిల్లీ చేరకుండా అడ్డుకుంటున్నారు. రైళ్లు, బస్సులు ఆపివేశారు. 20 నుంచి 30 వేల వరకూ పోలీసులను మోహరించారు. ఢిల్లీ ఒక దుర్బేధ్యమైన కోటగా మారిపోయింది. కానీ వ్యూహం భిన్నమైనది. పోలీస్ సిబ్బంది వీధుల్లో నిలబడాలని మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వం పెద్ద తప్పు చేస్తోంది. ఎందుకంటే జ్ఞానేశ్ కుమార్ ను రక్షించాలని మేము దేశానికి చూపించాలనుకుంటున్నాము’’ అని ఆయన అన్నారు.

బీజేపీ గూండాలు నిరసనకారులను కొడుతున్నారు...

నిరసన చేస్తున్న యువకులను కొట్టడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ గూండాలను అనుమతిస్తున్నారని, పోలీసులు వారిని చితకబాదుతున్నారని అన్నారు. నిరసనల సమయంలో ఆర్ఎస్ఎస్ వ్యక్తులు కొట్టగా, పోలీసులు మౌనంగా చూస్తూ ఉండిపోయారని యువకులు చెబుతున్న ఫుటేజ్ తో కూడిన వీడియోలను ఆయన విడుదల చేశారు.

మేము ఆగము...

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే దాక ఆయనకు వ్యతిరేకంగా నిరసన చేసే లక్షలాది మంది ప్రజలు ఆగబోరని రాహుల్ అన్నారు. ప్రధాన న్యాయమూర్తి ఇండి బ్లాక్ కూటమి ప్రతినిధులను కలవడానికి నిరాకరించినప్పటికీ తమ పాదయాత్ర కొనసాగుతుందని, తరువాత పిటిషన్ దాఖలు చేస్తుందని రాహుల్ అన్నారు. కనాట్ ప్లేస్ నుంచి బారాఖంబా రోడ్ వరకూ జరిగే నిరసన ప్రదర్శనలలో పాల్గొనాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రతిపక్షాన్ని కలవడానికి సీజేఐ నిరాకరించడంపై రాహుల్ మాట్లాడుతూ.. ప్రతిపక్షం సీజేఐని, సుప్రీంకోర్టును గౌరవిస్తుందని, ఆయనకు వినతిపత్రం సమర్పించే బదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సీజేఐ తమకు ఒక మార్గాన్ని చూపినందుకు సంతోషంగా ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా ఇదే తరహ విస్తృత నిరసనలు నిర్వహిస్తున్న సీజేపీ తో ఇండి కూటమికి ఏవైన విభేదాలు ఉన్నాయా ప్రశ్నను కూడా ఆయన కొట్టిపారేశారు.
‘‘సమాంతర నిరసన అంటూ ఏమి లేదు. ఇప్పుడు అంతా ఒకే నిరసన. మీకు మా సహాయం అవసరమైతే.. మేము మీకు అండగా ఉంటాము.. మీ నుంచి కూడా మేము అదే ఆశిస్తున్నాము’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
Read More
Next Story