భదత్రా బలగాల ఆధీనంలో ఢిల్లీ
x

భదత్రా బలగాల ఆధీనంలో ఢిల్లీ

సీజేపీ, విపక్ష నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు


Click the Play button to hear this message in audio format

జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధానిలో కనివిని ఎరగని రీతిలో భద్రతా దళాలను మోహరించారు. దాదాపు 25 వేల మంది పారామిలిటరీ దళాలు విధుల్లో ఉన్నాయి. నిరసనకారులు జంతర్మంతర్ ప్రదేశానికి చేరుకోకుండా నిరోధించడానికి పోలీసులు ముందుజాగ్రత్తగా అరెస్ట్ లు ముమ్మరం చేసింది. గడిచిన 24 గంటల్లో దాదాపు వేయి మంది నిరసనకారులను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు.

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, యూట్యూబర్ ధ్రువ్ రాతీ, సీజేపీ కి చెందిన రత్నసింగ్, సౌరబ్ దాస్, అనేకమంది కంటెంట్ క్రియేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే మాజీ సీఎం విజయన్, ఏంఏ బేబీ వంటి సీనియర్ వామపక్ష నేతనలను కూడా కేరళ హౌస్ లో నిర్భంధించారు.
ఢిల్లీలో విమానం దిగిన వెంటనే అభిజిత్ దీప్కెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను అరెస్ట్ చేస్తున్న సమయంలో అతను ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ చేశారు. ఇందులో పోలీసులు దీప్కేతో పాటు, సీజేపీ సభ్యులైన సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకాలను కూడా అదుపులోకి తీసుకున్నారు.

పేలడానికి సిద్దంగా ఉన్న..

భద్రతా పరిస్థితిని నిర్వహించడంలో ఢిల్లీ పోలీసులకు సహాయపడటానికి కేంద్ర సాయుధ బలగాలకు చెందిన 120 కంపెనీలు రానున్నాయి. వీరిని వ్యూహాత్మక ప్రదేశాలలో సిబ్బందిని మోహరించారు. అదే సమయంలో అనేక చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించారు.
జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, అదనపు డిప్యూటీ కమిషనర్లు సహ సీనియర్ పోలీసు అధికారులు నిశితంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వీరు న్యూఢిల్లీని 20 జోన్లు విభజించారు. సీజేపీ నిరసన ప్రదర్శనకు కేవలం మూడు రోజుల ముందు దరఖాస్తు చేసిందని, కానీ నిబంధనల ప్రకారం పదిరోజుల ముందే ఈ దరఖాస్తు చేయాల్సి ఉండేదని జాయింట్ ఆఫ్ పోలీస్ నూపుర్ ప్రసాద్ శుక్రవారం పేర్కొన్నారు.
గతంలో కూడా ఇలాగే దరఖాస్తు చేసి నిబంధనలు పాటిస్తామని చెప్పారని, కానీ అసలు రోజు వాటిని పట్టించుకోకుండా ఆందోళన చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా చర్యలలో భాగంగా శుక్రవారం రాత్రి నుంచి 45 ఢిల్లీ మెట్రో స్టేషన్ల ప్రవేశ, నిష్ర్కమణ ద్వారాలను మూసివేస్తున్నారు. ప్రభావిత స్టేషన్లలో రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, న్యూఢిల్లీ, పటేల్ చౌక్, మండి హౌస్, జన్ పథ్, సుప్రీంకోర్టు, ఐటీఓ, కాశ్మీర్ గేట్ తో పాటు దక్షిణ, ఈశాన్య ఢిల్లీలోని పలు స్టేషన్ లు ఉన్నాయి. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయి.

రైళ్ల దారి మళ్లింపు..

ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ న్యూషఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లకు రావాల్సిన లేదా అక్కడి నుంచి బయల్దేరాల్సిన అనేక రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. దీనితో ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. న్యూఢిల్లీకి వచ్చే 200 కి పైగా రైళ్లు రద్దు చేయబడ్డాయని కొన్ని నివేదికలు వస్తున్నాయి.
అయితే రైల్వే టికెట్లు ఉన్నవారిని ఎలాంటి ఇబ్బంది పెట్టమని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. జాతీయ రాజధాని సరిహద్దుల వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు హోటల్లు, గెస్ట్ హౌజ్ లు, లాడ్జీలు, ధర్మశాలలు, బస్ టెర్మినల్లను కూడా తనిఖీ చేస్తున్నారు.
నిరసనల కోసం ప్రజలను సమీకరించే ప్రయత్నాలపై కూడా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ప్రతి ఆన్ లైన్ పోస్ట్, సందేశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. 200 మందికి పైగా కంటెంట్ క్రియెటర్లపై నిఘా కొనసాగుతోంది.
అలాగే ఢిల్లీ వ్యాప్తంగా మద్యం దుకాణాలు కూడా ముందస్తుగా మూసివేశారు. మతపరమైన ప్రదేశాలపై కూడా కఠినమైన నిఘాను కొనసాగిస్తున్నారు.
ఎన్నికల జాబితాలో అక్రమాలు జరిగాయని, ఫారం-6 కు సంబంధించి అవకతవకలు జరిగాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఎన్నికల సంఘం వీటిని తోసిపుచ్చింది. ఎన్నికల సంఘంలో ప్రతి నిర్ణయం కలిసికట్టుగా తీసుకుంటున్నామని, అర్హుల ఓట్లు తొలగించడం లేదని, కేవలం చనిపోయిన, వలసలు, డబుల ఓట్లను మాత్రమే తొలగిస్తున్నామని వెల్లడించింది. ఈ విషయంపై సుప్రీంకోర్టు లో సైతం విచారణ జరుగుతోంది. అయితే వీటిని విపక్షాలు పట్టించుకోకుండా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే అంటూ వీధి పోరాటాలకు దిగాయి.
అధికార బీజేపీ వీటిని తిప్పికొడుతోంది. ఓట్ చోరి జరిగితే హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళలో కాంగ్రెస్ ఎలా గెలిచిందని ప్రశ్నలు గుప్పించారు. ఈ మధ్య బీహార్ లో జరిగిన ఉప ఎన్నిక బాంకీపూర్ లో జన్ సురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ గెలుచున్నారు. ఓట్ చోరి జరిగితే ఇక్కడ విపక్ష నేత ఎలా గెలిచారని ప్రశ్నలు గుప్పించింది.


Read More
Next Story