సీజేపీ ఉద్యమాన్ని విరమించి తప్పు చేసిందా?
x

సీజేపీ ఉద్యమాన్ని విరమించి తప్పు చేసిందా?

హమీలు అమలయ్యే దాక జంతర్ మంతర్ లో ఉండాల్సిందే అన్న విశ్లేషకులు


Click the Play button to hear this message in audio format

నీట్ పై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేస్తున్న ఉద్యమం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాత సీజేపీ తన ఉద్యమాన్ని విరమించుకున్నట్లు ప్రకటించింది. అయితే ఇది తప్పుడు నిర్ణయం అనే చర్చను లేవనెత్తింది.

ఆందోళనను నిలిపివేసి, నాలుగు వారాల తర్వాత చర్చలకు తిరిగి రావాలన్న సీజేపీ చర్యను రచయిత, విధాన నిపుణుడు పుష్పరాజ్ దేశ్‌పాండే విమర్శించారు. "వ్యూహాత్మకంగా ఇది సరికాదు" అని అభివర్ణించారు. దానికి బదులుగా, నిరసనకారులు జంతర్ మంతర్ వద్దే ఉండి, ప్రభుత్వం నుంచి జవాబుదారీతనం కోసం ఒత్తిడిని కొనసాగించాలని ఆయన సలహా ఇచ్చారు.

'ఉద్యమం కొనసాగాలి'

సీజేపీ ఉద్యమం ఇంకా కొనసాగాలని దేశ్‌పాండే అన్నారు. ఒక పెద్ద రాజకీయ రాయితీని సాధించిన తర్వాత వెనక్కి తగ్గకుండా, సీజేపీ తనకున్న ప్రయోజనాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందని ఆయన అన్నారు. ఫుట్‌బాల్ ఉపమానాన్ని ఉపయోగిస్తూ, ప్రత్యర్థి గోల్‌కు సమీపిస్తున్న జట్టు, గోల్ చేయడానికి ప్రయత్నించకుండానే ఆటను ఆపేయడంతో ఆయన ఈ పరిస్థితిని పోల్చారు. దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా పరిణమించిన ఒక ఉద్యమాన్ని ఏకపక్షంగా ముగించే అధికారం ఏ వ్యక్తికీ లేదా సంస్థకూ లేదని ఆయన అన్నారు. ‘ది ఫెడరల్’ నిర్వహించే క్యాపిటర్ బీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.

విజయం సాధించిందా?

ప్రధాన్ రాజీనామాను సీజేపీ సాధించిన అతిపెద్ద విజయంగా అభివర్ణించారు. నరేంద్ర మోదీ పాలనలో ప్రజా ఒత్తిడి కారణంగా ఒక మంత్రిని తొలగించాల్సి రావడం ఇదే ప్రథమం అని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య జవాబుదారీతనంతో కాకుండా సంస్థాగత సరిహద్దులను దాటి విస్తరించిన ఒక ఉద్యమం చేతిలో ఇరుక్కుపోవడం వల్లే ఇలా వ్యవహరించింది.
ఈ నిరసన మతాలు, ప్రాంతాలకు అతీతంగా స్పందన వచ్చిందని, దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించాయని, ఇది నిజమైన ప్రజా ఉద్యమంగా మారిందని అన్నారు. కేంద్రమంత్రి రాజీనామా తరువాత దీక్ష విరమించుకోవడానికి బదులుగా, విద్యారంగంలో లోతైన నిర్మాణాత్మక సంస్కరణల కోసం లాఠీచార్జ్ చేసిన వారిపై చర్యలకు డిమాండ్ చేయాల్సి ఉండేదని పేర్కొన్నారు.

సంధి దశకు చేరుకుందా?

నీట్ పరీక్ష పేపర్ లీక్ తరువాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు కోటీ రూపాయల పరిహారం హామీ నెరవేరలేదని, అలాగే విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు, ఢిల్లీ పోలీసుల నుంచి బహిరంగ క్షమాపణ వంటి డిమాండ్లు నెరవేర్చకుండానే సీజేపీ ఉద్యమాన్ని విరమించడం ఏంటనీ అన్నారు.
ప్రధాన్ రాజీనామా తరువాత నిరసన విరమిస్తున్నట్లు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే బహిరంగంగా ప్రకటించడంతో ఈ ఆందోళన సంధి దశకు చేరింది. పెండింగ్ లో ఉన్న ఇతర సమస్యలపై ప్రభుత్వం ఎలాంటి లిఖితపూర్వక హమీ ఇవ్వకపోగా, జూలై 28 వరకూ సమయం కోరింది.
దీని ఈ ఉద్యమం ముగిసిందా లేదా అనే దానిపై సందిగ్థం నెలకొంది. నిరసనకారులు అక్కడి నుంచి వెళ్లిపోతే ప్రభుత్వం తిరిగి ఫుంజుకుంటుందని, జంతర్ మంతర్ వద్దే ఉండి నిరసన కొనసాగించాలని అన్నారు. రాజీనామాతో అంతా అయిపోలేదని, నిరసనకారులు చాలాకాలంగా నిర్మించుకున్న ప్రజాబలం బలహీనపడిపోయిందని అన్నారు.

చాకచక్యమైన రాజకీయ ఎత్తుగడ...

ప్రధాన్ రాజీనామాపై సీనియర్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్పందించారు. ఆయన పదవీకాలాన్ని అత్యుద్భుతమైనది వారు వర్ణిస్తూ సందేశాలు పంపారు. వీటిని కూడా ఆయన ఖండించారు. ప్రజల ఆగ్రహాన్ని గుర్తించడం కంటే ప్రభుత్వ రాజకీయ కథనాన్ని కాపాడే ప్రయత్నమని ఆయన ఆరోపించారు.
ప్రధాన్ రాజీనామా జవాబుదారీతనంలా లేదని, రాజకీయ ఒత్తిడిని తగ్గించే వ్యూహం అని ఆరోపించారు. ప్రధాన్ రాజీనామా చేశాక, ఆయన పదవీకాలాన్ని వేడుకగా జరుపుకోవడం ఈ చర్య ద్వారా ప్రభుత్వం ఆశించిన సద్భావనను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

Read More
Next Story