బీజేపీ జైత్రయాత్రకు సీజేపీ బ్రేక్ వేసిందా?
x

బీజేపీ జైత్రయాత్రకు సీజేపీ బ్రేక్ వేసిందా?

‘ది ఫెడరల్’ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎస్. శ్రీనివాసన్, విద్యావేత్త ఏ కలియరసన్ విశ్లేషణ


Click the Play button to hear this message in audio format

సీసా మూత తీయగానే.. బొద్దింకలు బయటకు వచ్చినట్లు.. ఢిల్లీలోనే కూడా ఆ విధంగానే ఒక్కసారిగా వందలాది మంది యువత వచ్చి వాలిపోయారు. కానీ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో ఎవ్వరికి తెలియదు.

ఢిల్లీలో నిన్న, మొన్న జరిగిన సంఘటనల గురించి తన స్నేహితుడు చెప్పిన సంగతులను ‘ది ఫెడరల్’ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎస్. శ్రీనివాసన్ గుర్తు చేసుకున్నారు. మొదట ఇది చిన్న నిరసనగా కనిపించినప్పటికీ, త్వరంగా జాతీయ స్థాయి సంఘటనగా మారింది.
నీట్ వివాదం, సోనమ్ వాంగ్ చుక్ నిరసనతో ప్రారంభమైన ఉద్యమం ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించింది. ఈ సంఘటన ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. యువత అభిప్రాయాలను బలంగా ప్రభుత్వం ముందు నిలబడేలా చేసింది.
శ్రీనివాసన్, ఆర్థికవేత్త ఎ. కలైయరసన్ ప్రకారం.. సీజేపీ నిరసనలు కేవలం నీట్ పరీక్ష లీకేజీకే సంబంధించినది కాదు.. దేశంలో యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేనే సత్యాన్ని సైతం ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లింది. పెరుగుతున్న ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ విధాన నిర్ణయాలు లేవనే సత్యాన్ని ఇది వివరించింది. ఆర్థిక వ్యవస్థ క్రమంగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందనే సత్యాన్ని ఇది వెలికితీసింది.

బీజేపీ జైత్రయాత్రకు బ్రేక్ పడిందా?

ఇప్పటికిప్పుడే ఈ విషయాన్ని అంచనా వేయలేము. కానీ ప్రభుత్వం మాత్రం తక్షణం స్పందించాల్సి వచ్చింది. ఇది దాని కథనాన్ని మార్చాల్సిన అవసరం పరిస్థితి తీసుకొచ్చింది. ఈ పరిస్థితులపై బీజేపీపై కొంత ఒత్తిడిని తీసుకొచ్చాయనేది మాత్రం నిజం.
మొదట్లో ఈ నిరసనపై ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టలేదు. మమ్మల్ని పరామర్శించడానికి ఎవరూ రాలేదని సీజేపీ ప్రతినిధులు విమర్శించారు. కానీ నిరసనకారుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది. కేంద్రమంత్రి జేపీ నడ్డా సీజేపీ సభ్యులను కలిసి సంప్రదింపుల మార్గాన్ని తెరిచింది.
ప్రతిపక్షాలు కూడా వెంటనే స్పందించాయి. రాహుల్ గాంధీ ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు బంతి రాహుల్ గాంధీ చేతిలో ఉందని శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు.

భవిష్యత్ గురించి యువత ఆందోళన..

ఈ నిరసనలు కేవలం నీట్ తోనే లేవని కలైయరసన్ అభిప్రాయపడ్డారు. నేటీ యువత భవిష్యత్ గురించి ఆందోళన చెందుతున్నారు. చదువుకు, ఉపాధికి సంబంధం ఉండటం లేదని, వాటికి మారే క్రమంలో అనేక అవరోధాలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
చాలామంది భారతీయ విద్యార్థులు అర్ధవంతమైన ఉపాధి పొందడానికి అనేక కష్టాలు పడుతున్నారనే సత్యాన్ని ఆయన గణాంకాల ఆధారంగా వివరించే ప్రయత్నం చేశారు. ఉన్నత విద్య సాధించిన తరువాత కూడా దానికి తగ్గ ఉపాధి లభించడం లేదన్నారు.
సమస్య ఉద్యోగాలు లభించకపోవడం మాత్రమే కాదని, ఉపాధి నాణ్యత కూడా కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు తక్కువ స్థాయి వేతనాలకు పనిచేస్తున్నారనే సంగతిని ఆయన ఎత్తిచూపారు. సంవత్సరాలుగా పనిచేసిన తమ జీతం కొంచెం కూడా పెరగకుండా అలాగే ఉందనే సత్యాన్ని యువత గ్రహించారని కలైయరసన్ వాదించారు.

తగినన్నీ ఉపాధి అవకాశాలు సృష్టించని ఆర్థిక వ్యవస్థ..

భారత్ ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ కావచ్చు. కానీ వృద్ధి గణాంకాలు ఆర్థిక వ్యవస్థలోని నిర్మాణాత్మక బలహీనతలను దాచిపెడుతున్నాయని కలైయరసన్ వాదన. దాన్ని తలసరి ఆదాయంగా మార్చుకుంటేనే భారత్ మధ్యస్థ ఆదాయ దేశంగా మారగలదని ఆయన అంటారు.
దేశ వృద్ధి స్వరూపం మారిందని, ఆర్థిక విస్తరణ ఒకప్పుడు ఉద్యోగాలు, ప్రైవేట్ పెట్టుబడులను తీసుకు వచ్చేదిగా ఉండేదని, కానీ ఇప్పుడు మాత్రం తక్కువ ఉపాధి కల్పనకు పరిమితమయిందని చెప్పారు. మనం బలమైన తయారీ రంగాన్ని నిర్మించకుండానే వ్యవసాయ రంగం నుంచి సేవల రంగానికి మారినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రోజు దేశానికి వస్తున్న పెట్టుబడులు ఉపాధి అవకాశాలను తీసుకురావడం లేదని ఆయన విశ్లేషించారు. యువత నిరసన తెలియజేయడానికి ఈ మూలాలే కారణమని ఆయన పేర్కొన్నారు.

విమర్శకులకు తప్పు అని నిరూపించిన తరం..

జెన్ జెడ్ మూస అభిప్రాయాలను కూడా ఈ సమీకరణం సవాల్ చేసింది. ‘‘ముందు తరం వారు.. తమ తరువాత తరాన్ని తక్కువగా చూస్తారు’’ కానీ అది తప్పని ఎప్పుడూ నిరూపితం అవుతూనే ఉందని శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు. యువత కేవలం డిజిటల్ స్క్రీన్ లకే పరిమితం కాలేదని ఇది నిరూపించినట్లు పేర్కొన్నారు.
లక్షలాది మంది సామాజిక ఉన్నతిని ఆశించి కళాశాల్లో ప్రవేశిస్తారు. కానీ దానికి అనుగుణమైన అవకాశాలను అందించలేని ఆర్థిక వ్యవస్థ ఉంటే నిరాశ అనివార్యమవుతుంది.. చదువుకున్న చదువుకు.. ఉపాధికి చాలా అంతరం ఉందని పేర్కొన్నారు.

సంస్థలపై విశ్వాసం లేకపోవడం..

యువత నిరసనలు విశ్వాసం లేకపోవడం వల్లే సంభవించాయని ఇద్దరు వక్తలు అంగీకరించారు. పరీక్షల లీక్ లు, నిష్పక్షపాతం లేకపోవడం, యోగ్యతపై సందేహాలు రావడంతో విద్యార్థుల్లో అసహనం పెరిగిందని అన్నారు. దీనిని గుర్తించడంలో మీడియా కూడా విఫలం అయిందని శ్రీనివాసన్ పేర్కొన్నారు.
జాతీయ మీడియా దీన్ని పూర్తిగా పట్టించుకోలేదు. ప్రధాన మీడియా సంస్థలు కూడా వీటిని పరిగణలోకి తీసుకోలేదు. ఇదే సమయంలో యువత ప్రత్యామ్నాయ వేదికల వైపు ఎక్కువగా దృష్టి సారించిందని ఆయన శ్రీని పేర్కొన్నారు. పరిపాలన యంత్రాంగం కూడా యువత పెద్ద మొత్తంలో రావడంతో ఆశ్చర్యపోయిందని, ఢిల్లీ పోలీసులు కూడా దీనిని అంగీకరించారని శ్రీనివాసన్ పేర్కొన్నారు.

శాశ్వతంగా ప్రభావం..

కలైయరసన్ దృష్టిలో ఈ నిరసన మూడు అత్యవసర విషయాలను వెలుగులోకి తెచ్చింది. విద్యా వ్యవస్థను చక్కదిద్దడం, నాణ్యమైన ఉపాధి కల్పన, సంస్థలపై నమ్మకాన్ని పునరుద్దరించడం.. రాజకీయ కోణం నుంచి ఇది సరైనదే అని శ్రీనివాసన్ కూడా అభిప్రాయపడ్డారు. నిరసనలు ప్రస్తుతం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయని ఆయన అన్నారు. సీజేపీ నిరసన ప్రభుత్వ విధానాలను మారుస్తుందో లేదో మున్ముందు తెలుస్తుంది.

Read More
Next Story