
అశుతోష్ దీక్షిత్
తదుపరి ఎయిర్ చీఫ్ మార్షల్ గా దీక్షిత్
ఉత్తర్వులు జారీ చేసిన రక్షణ మంత్రిత్వ శాఖ
భారత ఎయిర్ ఫోర్స్ కు తదుపరి చీఫ్ గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నియమితులవుతారని భారత రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ స్థానంలో ఆయన బాధ్యతలు తీసుకుంటారని వెల్లడించింది. అశుతోష్ దీక్షిత్ కు దాదాపు 20 రకాల యుద్ధ విమానాల్లో 3,500 గంటలకు పైగా అనుభవం ఉంది.
దీక్షిత్ కు వ్యూహాత్మక ప్రణాళిక కర్తగా పేరుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో కీలకపాత్ర పోషించిన దీక్షిత్ ప్రస్తుతం దళానికి వైస్ చీఫ్ గా పనిచేస్తున్నారు. నాలుగు దశాబ్దాల పాటు సాగిన ఆయన కెరీర్ లో పలు రకాల కమాండ్, స్టాఫ్, బోధన పదవులు నిర్వహించారు.
ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ అక్టోబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు. నవంబర్ 1న దీక్షిత్ అధికారికంగా 29వ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ గా ప్రభుత్వం నియమించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
1966 డిసెంబర్ 9న జన్మించిన ఎయిర్ మార్షల్ దీక్షిత్, 1986 డిసెంబర్ 6న భారత వైమానిక దళంలో ఫైటర్ జెట్ పైలెట్ గా నియమితులయ్యారు. వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు, ఆయన హెడ్ క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ లో చైర్మన్, చీఫ్ ఆఫ్ స్టాప్ కమిటీ కి చీఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ గా పనిచేశారు. దానికి ముందు, ఆయన సెంట్రల్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా పనిచేశారు.
ఎయిర్ మార్షల్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ డిఫెన్స్ స్టాఫ్ సర్వీస్ కాలేజ్(బంగ్లాదేశ్), నేషనల్ డిఫెన్స్ కాలేజీ పూర్వ విద్యార్థి, ఆయనకు మిరాజ్- 2000, మిగ్ వేరియంట్లు అయిన కిరణ్, జాగ్వార్, ఐఎల్ 78, హాక్, తేజస్ వంటి వివిధ విమానాలలో 3500 గంటలకు పైగా విహరించారు. అలాగే ఆయన టెస్ట్ పైలెట్, ఫ్లయింగ్ ఇన్ స్ట్రక్టర్. సుమారు నాలుగు దశాబ్దాల పాటు సాగిన తన సేవా జీవితంలో, ఎయిర్ మార్షల్ దీక్షిత్ ఆపరేషన్ సఫేద్ సాగర్, ఆపరేషన్ రక్షక్, ఆపరేషన్ సింధూర్ వంటి అనేక ఆపరేషన్ల, విన్యాసాలలో చురుకుగా పాల్గొన్నారు. ఎయిర్ మార్షల్ పలు ముఖ్యమైన క్షేత్ర, సిబ్బంది నియామకాలను నిర్వహించారు.
ఆయన పశ్చిమ సెక్టార్ లోని ఒక ఫ్రంట్ లైన్ ఫైటర్ ఎయిర్ బేస్ కు దక్షిణ సెక్టార్ లోని ఒక ప్రముఖ ఫైటర్ శిక్షణా స్థావరానికి కమాండర్ గా వ్యవహరించారు. అలాగే ఆయన అనేక ఫైటర్ జెట్ల ఏవియానిక్స్ అప్ గ్రేడ్ లలో కీలక పాత్ర పోషించారు. ఆయనకు విశిష్ట సేవలకు గుర్తింపుగా 2006 లో వాయు సేన పతాకం, 2011 లో విశిష్ట సేవాపతకం, 2023 లో అతి విశిష్ట సేవాపతకం, 2026 లో పరమ విశిష్ట సేవా పతకాలు లభించాయి.
Next Story

