రేవంత్ ను కాపాడుతున్నదెవరో తెలుసా ?
x

రేవంత్ ను కాపాడుతున్నదెవరో తెలుసా ?

బీఆర్ఎస్ కీలక నేత తన్నీరు హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.


తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. బాయిబాట పేరుతో సింగరేణి గనులను సందర్శస్తున్న కవిత మాట్లాడుతు బీఆర్ఎస్ కీలక నేత తన్నీరు హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది హరీషే అని కవిత చెప్పారు. రేవంత్ ను హరీష్ ఏ విధంగా కాపాడుతున్నారు అన్న విషయాన్ని మాత్రం ఆమె చెప్పలేదు. మొదటినుండి హరీష్ అంటే కవిత భగ్గున మండుతున్న విషయం అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ లో దయ్యాలున్నాయ్, కేసీఆర్ ను దయ్యాలు తప్పుదోవ పట్టిస్తున్నాయంటు గతంలో ఆమె చేసిన ఆరోపణలు అందరికీ తెలిసిందే.

బాయిబాట సందర్భంగా కవిత మాట్లాడుతు సింగరేణి కార్మికుల సంక్షేమమే తనకు ముఖ్యమన్నారు. సింగరేణి కార్మికులకు కనీసం నాణ్యత కలిగిన యంత్రాలను కూడా యాజమాన్యం అందుబాటులో ఉంచటంలేదని మండిపడ్డారు. ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసే బొగ్గుగని కార్మికుల భద్రతను ప్రభుత్వం గాలికి వదిలేసినట్లు ఆరోపించారు. ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని రేవంత్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గురించి మాట్లాడుతు సింగరేణి ప్రాంతాల్లో పర్యటనలను అడ్డకుంటున్నట్లు ధ్వజమెత్తారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళకుండా అడ్డుకుంటూ, ఈ వ్యవహారం ద్వారా శ్రీధర్ రాజకీయ లబ్దిపొందాలని ప్రయత్నిస్తున్నట్లు కవిత ఆరోపించారు.

Read More
Next Story