ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషియన్స్ నుండి రాజీనామా చేసిన డాక్టర్ శివరంజని
x

ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషియన్స్ నుండి రాజీనామా చేసిన డాక్టర్ శివరంజని

కెన్వ్యూ కంపెనీ పంపిన లీగల్ నోటీసులను ఖండించని సంస్థలో భాగంగా ఉండబోనని ఆమె రాజీనామా చేశారు


ఫ్లేవర్డ్ ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ అమ్ముతున్న కంపెనీలు తన పై కేసు వేసి లీగల్ నోటిస్ పంపినా స్పందించని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషియన్స్ లో తాను భాగస్వామిగా ఉండబోనని ఆ సంస్థ సభ్యత్వానికి డాక్టర్ శివరంజని సంతోష్ రాజీనామా చేశారు. గత ఆరేళ్లుగా వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్న తనకు సామాజిక మాధ్యమాల్లో బెదిరింపులు వస్తున్నా పట్టించుకోని సంస్థలో భాగస్వామ్యం తనకు అవసరం లేదని ఆమె తెలిపారు.

ఫ్లేవర్డ్ ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ అమ్ముతున్న కంపెనీలకు వ్యతిరేకంగా తన గళం ఎత్తిన ఆమెకు జాన్సన్ అండ్ జాన్సన్, కెన్వ్యూ కంపెనీలు నోటీసులు పంపాయి. దానికి ప్రతిగా నిర్వహించిన ఆన్లైన్ మీడియా సమావేశంలో ఆ కంపెనీలు తనకు బేషరతు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. నిబంధనలు పాటించే మరే దేశంలో అయినా ఈ కంపెనీలు ఎన్నో కేసులు ఎదుర్కోవాల్సి వచ్చేదని ఆమె ఆ సందర్భంగా గుర్తు చేశారు.

కేసులతో తన నోరుమూయించాలని కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని అయితే నిజాన్ని చెప్పడం మాననని అందుకు కంపెనీల ఆగడాలను అరికట్టడంలో ప్రభుత్వం చొరవ చూపాలని మీడియాతో జరిపిన ఆన్లైన్ ప్రెస్ మీట్ లో స్పష్టం చేశారు.

డాక్టర్ కు పంపిన నోటీసులో కెన్వ్యూ 2026 జనవరిలో తాము రెండు వేరు వేరు ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేశామని పేర్కొంది. డయేరియా చికిత్స కోసం డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు అణుగుణంగా ఓఆర్ఎస్ఎల్ ను రోజువారీ సేవించే ఎలక్ట్రోలైట్ డ్రింక్‌గా ఈ-ఆర్జెఎల్ అమ్ముతాము, అని అందులో స్పష్టం చేసింది. కంపెనీ ఎప్పుడూ పారదర్శకంగా వ్యవహరించిందని కేవలం కొందరు వ్యక్తులు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కంపెనీ పేర్కొంది. ఈ విషయం పై శాస్త్రీయ చర్చలకు తాము సిద్ధమని, ప్రజా ఆరోగ్యానికి ఎప్పుడు కట్టుబడి ఉంటామని అది స్పష్టం చేసింది.

ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషియన్స్ ఆ నోటీసును ఖండించ లేదు. “నాకు మద్దతు ఇవ్వమని బహిరంగంగా కోరినా పట్టించుకోలేదు. పైగా ఓఆర్ఎస్ పై తప్పుదోవ పట్టించే ప్రకటన జారీచేసారు. దశాబ్దాలుగా వాడుతున్న ఓఆర్ఎస్ పై ఇప్పుడు ప్రకటన జారీచేయటం వెనుక ఉద్దేశం ఏమిటి?,” అని ఆమె ప్రశ్నించారు.

మెడికల్ కాన్ఫరెన్స్ ల నిర్వహణకు ఈ కంపెనీలు ఇస్తున్న నిధుల కోసమే ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషియన్స్ ఈ వైఖరి తీసుకున్నట్టు స్పష్టం అవుతోందని డాక్టర్ శివరంజని ఆరోపించారు.

డాక్టర్ లలో తనకు వ్యతిరేకంగా ప్రచారానికి ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషియన్స్ ఊతమివ్వటం పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. ఈ విషయాలపై ఎన్నో ఏళ్లుగా తాను ఆ సంస్థతో మాట్లాడుతున్నట్టు ఆ తరువాతే ఈ విషయం పై తన వైఖరిని బహిరంగంగా వ్యక్తపరిచినట్టు ఆమే చెప్పారు. “నేను లేవ నెత్తిన విషయాలపై నా ఆలోచనలో మార్పు లేదు,” అని ఆమె అన్నారు.

దేశ వ్యాప్తంగా ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషియన్స్ సంస్థలో 47,000 మంది డాక్టర్లు సభ్యత్వం కలిగి ఉన్నారు.

Read More
Next Story