
కేంద్ర మంత్రివర్గంలో ఈటెల, అరవింద్‌కు ఛాన్స్?
జూన్ రెండో వారంలో జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలంగాణకు చెందిన ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్‌లకు అవకాశం లభించే సూచనలు.
త్వరలో జరుగనున్న కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో తెలంగాణాకు చెందిన ఇద్దరికీ అవకాశం ఇవ్వాలని బీజేపీ పెద్దలు యోచిస్తున్నట్టు సమాచారం. జూన్ రెండో వారంలో జరుగనున్న మంత్రి వర్గ విస్తరణలో వెనకబడిన తరగతికి చెందిన ఇద్దరు పార్లమెంట్ సభ్యులకు అవకాశం ఇవ్వాలని కమలం పెద్దలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణా నుంచి బీజేపీ ఎంపీలు ఎక్కువగా ఉన్నారు . మొత్తం ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులను అందించిన తెలంగాణ కు మంత్రి వర్గ విస్తరణలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి పెద్దగా ప్రాతినిధ్యం లేదు.తెలంగాణా సికిందరాబాద్ నుంచి ఎంపికైన జి.కిషన్ రెడ్డి , కరీంనగర్ నుంచి ఎంపికైన బండి సంజయ్ కేంద్ర మంత్రి వర్గం లో స్థానం కల్పించినప్పటికీ బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో ఇద్దరిని మంత్రి వర్గ విస్తరణ లో తీసుకోవాలని కమలం పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది . ప్రస్తుతం ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్న జి కిషన్ రెడ్డి , బండి సంజయ్ లకు తోడు గా మరో ఇద్దరికీ అవకాశం ఇవ్వాలని అదిష్టానం నిర్ణ యించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రానికి ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులను అందించిన తెలంగాణాకు ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు. తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువే ఉంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్ రెడ్డి , బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా ఉన్నారు. మల్కాజ్ గిరి నుంచి గెలిచిన ఈటెల రాజేందర్ ముదిరాజ్ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనతో బాటు నిజామాబాద్ నుంచి గెలిచిన ధర్మపురి అరవింద్ బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. వీరిద్దరికి కేంద్ర మంత్రి వర్గంలో చేర్చుకోవాలని అధిష్టానం ఆలోచిస్తుంది. అయితే మంత్రి వర్గ విస్తరణ చాలా కాలం నుంచి ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీని బెంగాల్లో బీజేపీ మట్టికరిపించింది మరో రెండేళ్ల తర్వాత తెలంగాణలోఅసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. బీజేపీ అధికారం చేజిక్కించుకోవాలంటే ఇప్పటినుంచే దూకుడు పెంచాలని కమలం పార్టీ భావిస్తుంది.గత ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అధికారం చేజిక్కుంచుకోవాలని అనుకుంది. కానీ బీజేపీ కలలు సాకారం కాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది . ప్రత్యేక తెలంగాణ లో కెసిఆర్ పార్టీ అధికారంలో వచ్చింది . ప్రత్యేక తెలంగాణలో 10 ఏళ్ళ పాటు అధికారంలో ఉన్న కెసిఆర్ పార్టీ కూలి పోయింది.ఆ పార్టీ 39 స్థానాలకు పరిమిత మైంది. ఆ ఎన్నికల్లో బీజేపీ 8 అసెంబ్లీ నియోజక వర్గాలకు పరిమితమైంది. మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఇటీవల మోది తెలంగాణలో మొదటిసారి వచ్చిన నేపథ్యంలో బీసీ డిమాండ్ బలంగా వినిపించింది. ప్రధాని బహిరంగ సభకు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు అత్యధిక సంఖ్యలో హాజరయ్యారు. తెలంగాణాలో బీజేపీ పాగా వేయాలంటే బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తుంది
బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మైనర్ బాలిక పై అత్యాచారం కేసులో ఇరుక్కోవడంతో బీజేపీ ఆత్మ రక్షణలో పడింది.దేశవ్యాప్తంగా బండి సంజయ్ మీద నెగెటివ్ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మంత్రి పదవి పోతుందని అందరూ అనుకున్నారు. . దీనికి తోడు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా బండి సంజయ్ ని అర్జంటుగా ఢిల్లీకి పిలిపించుకున్నారు. బండి సంజయ్ కేంద్ర హోమ్ శాఖా సహాయ మంత్రి హోదాలో ఉన్నారు. తన కొడుకును పోలీసులకు అప్పగించినట్టు బండి సంజయ్ అమిత్ షా కి వివరించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వ లేక కాంగ్రెస్ ప్రభుత్వం కేసులో ఇరికించినట్టు బండి సంజయ్ అమిత్ షాకి వివరించినట్టు సమాచారం. తన కొడుకుపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని, త్వరలో నిర్దోషిగా బయట పడనున్నట్టు బండి సంజయ్ చెబుతున్నారు.
ప్రస్తుతం తెలంగాణాకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులకు పదవీగండం లేన్నప్పటికీ ఈటెల రాజేందర్ , ధర్మపురి అరవింద్ లకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం యోచిస్తుంది. ధర్మపురి అరవింద్ ఉమ్మడి రాష్ట్రం లో మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన ధర్మపురి శ్రీనివాస్ కుమారుడు. కరడుగట్టిన కాంగ్రెస్ వాది అయిన శ్రీనివాస్ కుమారుడు ధర్మ పురి అరవింద్ తెరాస అధినేత కెసిఆర్ కూతురు కవితను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించడం సానుకూల అంశం.ధర్మ పూరి అరవింద్ కవిత కు రాజకీయ సమాధిని కట్టినట్లు బీజేపీ ప్రచారం చేసుకుంటుంది. ఆమె కొత్తగా పార్టీ పెట్టినప్పటికీ ప్రయోజనం లేదని బీజేపీ చెబుతోంది.
ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన పార్లమెంట్ సభ్యులకు కేంద్ర మంత్రి వర్గంలో తీసుకుంటే తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతోందన్న వాదన ఉంది.

