x

ఎల్‌నినో దెబ్బకు పెరుగుతున్న ప్రత్యామ్నాయ పంటల విస్తీర్ణం (వీడియో)

జూలైలో నమోదైన వర్షపాతం 158 మిల్లీమీటర్లు మాత్రమే


ఎల్ నినో ప్రభావం కారణంగా తెలంగాణలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. రబీ, ఖరీఫ్ సీజన్లో కలిపి రాష్ట్రంలో 1.40 కోట్ల ఎకరాల్లో పంటలు పండుతాయి. వీటిల్లో వరి విస్తీర్ణం సుమారుగా 70 లక్షల ఎకరాల్లో ఉంటుంది. వేరుశెనగ, చెరకు, పత్తి, పప్పు ధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలంతా కలిపి మిగిలిన భూముల్లో పండేవి.

ఎల్‌నినో ప్రభావం కారణంగా పప్పుధాన్యాలు, వేరుశేనగ, మొక్కజొన్న, ఆకుకూరలు, కూరగాయలు, ఆయిల్ పామ్ లాంటి పంటల వైపు రైతులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. మొత్తం విస్తీర్ణంలో ఇప్పటికి 10 శాతం భూముల్లోనే వరి వేశారు. మామూలుగా జూలై నెలలో 234 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాలి. అయితే ప్రస్తుత జూలైలో నమోదైన వర్షపాతం 158 మిల్లీమీటర్లు మాత్రమే. దాంతో వరిని ఎట్టి పరిస్ధితుల్లోను సాగుచేయద్దని ప్రభుత్వం పదేపదే రైతులకు చెబుతోంది.

వర్షాభావ పరిస్ధితుల కారణంగా బోర్లు, బావులు, చెరువుల్లో నీరు ఎండిపోతోందని వ్యవసాయశాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇదే పరిస్ధితి మరికొన్ని రోజులు కొనసాగితే సాగునీటికి కాదు చివరకు మంచినీటికి కూడా ఇబ్బందులు తప్పవని ప్రభుత్వం ఆందోళన పడుతోంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 30 జిల్లాల్లో వర్షాభావ పరిస్ధితులు నెలకొన్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నేపధ్యంలోనే జూలై 30 వరకు రైతులు వేచిచూడాలని, అప్పుడు వర్షాలు పడితే పప్పుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలను సాగుచేయాలని సూచించారు.

Read More
Next Story