
ఎన్నికల సంఘ వ్యవహారం: కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డ బీజేపీ, ఢిల్లీలో నిరసన చేస్తున్న ఎన్ఎస్యూఐ
ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్ల అనుమతి లేకుండా కీలక నిర్ణయాలు తీసుకున్నారనే వివాదంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య కొత్తగా మాటల యుద్ధానికి కారణమైంది. ఈ అంశంపై సుప్రీంకోర్టుపై ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. అయితే పేపర్ లో వచ్చిన కథనాల ఆధారంగా తీర్పు ఇవ్వలేమని పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తరువాతే వాస్తవాు తెలుస్తాయని అన్నారు.
ఈ పరిణామంపై ప్రతిపక్ష కాంగ్రెస్, అధికార బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. కోర్టు జోక్యంతో అయిన కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకోవాలని వాదించింది. మరో వైపు కాంగ్రెస్ అనుబంధ విభాగమైన ఎన్ఎస్యూఐ సభ్యులు ఢిల్లీలో తమ ఆందోళన కొనసాగిస్తున్నారు.
సుప్రీంకోర్టులో...
పాట్నాకు చెందిన రాకేశ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘం నిర్ణయాలు సాధారణంగా ఏకగ్రీవంగా లేదా మెజారిటీతో తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో జ్ఞానేశ్ కుమార్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నారా, లేక మొత్తం కమిషన్ ఆమోదం ఉందా అన్నది రికార్డుల ద్వారా పరిశీలించనుంది.
అయితే, జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణం సస్పెండ్ చేయాలన్న పిటిషనర్ల అభ్యర్థనను సుప్రీంకోర్టు ప్రస్తుతానికి తిరస్కరించింది. చట్టబద్ధమైన విధానాన్ని పాటించకుండా నిర్ణయాలు తీసుకున్నట్లు తేలితే వాటిని పునఃపరిశీలించే లేదా రద్దు చేసే అవకాశం ఉందని కోర్టు స్పష్టం చేసింది.
ఈ పరిణామంపై కాంగ్రెస్ జ్ఞానేశ్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఫారమ్-6లో మార్పులను ఆయన ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన వారందరినీ జవాబుదారీగా నిలబెడతామని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ కూడా సుప్రీంకోర్టు జోక్యంతో ఎన్నికల సంఘంపై ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించే అవకాశం ఏర్పడిందని అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ, ఓటర్ల జాబితాలో మార్పులు, ఫారమ్-6లో జరిగిన మార్పులపై ఆయన పలు ఆరోపణలు చేశారు. మరోవైపు, ఎన్నికల సంఘం మాత్రం భిన్నాభిప్రాయాలు సంస్థాగత చర్చల్లో సహజమేనని, తన నిర్ణయాలన్నీ చట్టబద్ధమైన విధానాల ప్రకారమే తీసుకున్నామని ఇప్పటికే స్పష్టం చేసింది.
బీజేపీ మాత్రం కాంగ్రెస్ విమర్శలను తోసిపుచ్చింది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడం, దానిపై విచారణ జరగడం, నోటీసులు ఇవ్వడం వంటివి దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయనడానికి నిదర్శనమని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఎస్ఐఆర్పై అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని కూడా ప్రజాస్వామ్యంలో సహజమైన చర్చగా ఆయన అభివర్ణించారు.
ఇక ఢిల్లీలో ఎన్ఎస్యూఐ కార్యకర్తలు జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, అరెస్టు కోరుతూ నిరసన చేపట్టారు. రైసినా రోడ్‌లోని ఎన్ఎస్యూఐ కార్యాలయం సమీపంలో జరిగిన ఈ ఆందోళనలో కొందరు కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎన్ఎస్యూఐ తెలిపింది. ఓటర్ల హక్కులు, ఎన్నికల ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తుతున్న తమను అణచివేస్తున్నారని ఆ సంస్థ ఆరోపించింది.
ప్రస్తుతం సుప్రీంకోర్టు కోరిన సమాధానాలపై ఎన్నికల సంఘం, కేంద్రం స్పందించాల్సి ఉంది. ఆ సమాధానాలు, సంబంధిత రికార్డులను పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలపై కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Next Story

