
మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడి అరెస్ట్
హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు
మజీ బి ఆర్ ఎస్ ఎమ్ ఎల్ ఏ షకీల్ కుమారుడు రహీల్ ని శనివారం హైదరా బాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హిట్ అండ్ రన్ కేసులో ఆయన ప్రధాన నిందితుడు. నిజమాబాద్ బోధన్ ఎమ్మెల్యేగా షకీల్ పని చేశారు. 2004లో టీ ఆర్ ఎస్ లో రాజకీయ ప్రవేశం చేసిన షకీల్ వరుసగా రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా కొనసాగి మూడోసారి గెలవలేక పోయారు. రహీల్ పై కేసు ఉన్న నేపథ్యంలో దుబాయికి వెళ్లే అవకాశం లేదు. అయినా నిందితుడు దుబాయ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నట్టు పోలీసులకు ఉప్పందింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకుని అరెస్ట్ చేశారు. 2022 లో షకీల్ కుమారుడు రహీల్ అతి వేగంతో కారును నడిపి ఓ బాలుడు మరణానికి కారణమయ్యాడు,ఓ వైపు కేసు విచారణ సమయంలోనే నిందితుడు ఏప్రిల్ 17నాడు జూబిలీహిల్స్ పోలీసుల ముందు లొంగి పోయాడు. ప్రస్తుతం షరతులతో కూడిన బెయిల్ పై ఉన్న రహీల్ దుబాయ్ వెళ్ళడానికి ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు.
2018 లో
2018 మార్చి 18న రహిల్ నిర్లక్ష్యంగా కారు నడిపి బాలుడి మరణానికి కారణమయ్యాడు. కారు ప్రమాదం తరువాత కూడా రహీల్ దుబాయ్ వెళ్లి వచ్చాడు. జూబ్లీ హిల్స్ పోలీసుల ముందు ఇటీవలె లొంగిపొతే అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. కోర్ట్ ఉత్తర్వుల ప్రకారం రహిల్ విదేశాలకు వెళ్ళడానికి అనుమతి లేదు. అయినా రహీల్ దుబాయ్ వెళ్ళడానికి ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు.
రహీల్ ను రక్షించడానికి కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రమాదం జరిగినప్పటికీ బీఆర్ఎస్ శాసన సభ్యుడిగా ఉన్న షకీల్ కొడుకును కాపాడుతూ వచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ ముందు నుంచే ఆరోపణలు చేసింది. కేసీఆర్ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును పునరుద్ధరించింది.
రహిల్ పై మరో ఆక్సిడెంట్ కేసు ఉంది. ఈ నేపథ్యంలో పంజాగుట్ట పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ప్రజా భవన్ కార్యాలయం ముందు బారికేడ్లను గుద్దినట్లు పంజాగుట్ట పోలీసుల కేసు నమోదు చేశారు.

