జమ్మూకశ్మీర్ లోని ఉధంపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం
x

జమ్మూకశ్మీర్ లోని ఉధంపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

లోయలో పడిన బస్సు, పదిహేను మంది ప్రయాణికుల దుర్మరణం


Click the Play button to hear this message in audio format

జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడిపోవడంతో 15 మంది అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

రామ్ నగర్ ప్రాంతంలోని కాగోర్ట్ గ్రామం సమీపంలో ఉదయం 10 గంటల ప్రాంతంలో కొండ రహదారిపై ఉన్న ఒక మలుపు వద్ద బస్సు ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని రక్షించడానికి భారీ ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వారు చెప్పారు.

సహాయక చర్యలు..

ప్రమాదం జరిగినప్పుడు బస్సు ఒక మారుమూల గ్రామం నుంచి ఉధంపూర్‌కు వెళ్తోందని అధికారులు తెలిపారు. స్థానికులు మొదటగా ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని బయటకు తీస్తూ సహాయక చర్యలు ప్రారంభించారు. బాధితులను తరలించి, ప్రమాద స్థలాన్ని క్లియర్ చేయడానికి పోలీసులతో పాటు ఇతర అత్యవసర సహాయక బృందాలు వెంటనే ఆపరేషన్‌లో చేరాయి.
శిథిలాల నుంచి మొత్తం 15 మృతదేహాలను వెలికితీశామని, 20 మంది గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని, వారిలో చాలా మంది పరిస్థితి "తీవ్రంగా" ఉందని అధికారులు తెలిపారు.

ప్రభుత్వం స్పందన..

ఈ ఘటన జరిగిన తర్వాత తాను ఉధంపూర్ డిప్యూటీ కమిషనర్ మింగా షెర్పాతో మాట్లాడినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఒక ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు.
"గంట లోపే, రామ్‌నగర్ నుంచి ఉధంపూర్‌కు వెళ్తున్న ప్రజా రవాణా బస్సు కనోటే గ్రామంలో ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురైందని తెలుసుకున్న వెంటనే, ఉధంపూర్ డీసీ మింగా షెర్పాతో మాట్లాడాను. వెంటనే సాయక చర్యలు చేపట్టాం. భారీ ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది.
సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు. గాయపడిన వారిని వైద్య సహాయం కోసం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని విమానంలో తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేను స్థానిక అధికారులతో కూడా మాట్లాడాను. మా స్థానిక కార్యకర్తలతో కూడా నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాను" అని సింగ్ పేర్కొన్నారు.
ఈ ఘటనపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దీనిని ‘‘హృదయ విచారకర సంఘటనగా అభివర్ణించారు. "ఉధంపూర్‌లో జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాదం హృదయ విదారకం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. భగవంతుడు వారికి ధైర్యాన్ని ప్రసాదించాలి.
గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితులకు సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని జిల్లా యంత్రాంగం, పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఆరోగ్య శాఖలను ఆదేశించాను."

మృతదేహాల వెలికితీత..

ప్రమాదంలో గాయపడిన వారి మృతదేహాల వెలికితీత ముమ్మరంగా సాగుతోంది. గాయపడిన వారిని ఉధంపూర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆసుపత్రి, దాని అనుబంధ సౌకర్యాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంజీవ్ గుప్తా మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
Read More
Next Story