కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో నిర్వాసితుల ఉపాధి కోసం పోరాటం
x
రైల్వే జీఎం సంజయ్ కు వినతిపత్రాన్ని అందిస్తున్న బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్, మాజీ ఎమ్మెల్యే రమేష్ లు

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో నిర్వాసితుల ఉపాధి కోసం పోరాటం

రైల్వే జీఎంకు బీఆర్ఎస్ వినతి


కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, కోచ్ ఫ్యాక్టరీ కోసం భూములు ఇచ్చిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని దక్షిణ మధ్య రైల్వే జిఎం సంజయ్ శ్రీవాస్తవ్ కు సోమవారం సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో బీఆర్ఎస్ నేతలు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. జీఎంకు వినతి పత్రాన్ని అందజేసిన వారిలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. కాజీపేట రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయాలని, రైల్వే డివిజన్ చేయాలని, రైల్వేలో వ్యాపార అవకాశాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరారు.

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం భూములిచ్చి నిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కాజీపేట రైల్వే తయారీ యూనిట్ కోసం భూమి ఇచ్చిన రైతులకు ఉద్యోగ హామీలు అందించాలని భారత రాష్ట్ర సమితి (BRS) దక్షిణ మధ్య రైల్వేను కోరుతోంది. తాము ఈ విషయాన్ని రైల్వే బోర్డుకు పంపుతామని రైల్వే జీఎం సంజయ్ శ్రీవాస్తవ్ హామీ ఇచ్చారు.

కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్‌లో స్థానికులకు ఉపాధి కల్పించడంతోపాటు రోలింగ్ స్టాక్‌ను తయారు చేసే సామర్థ్యం పెంచాలని వారు కోరారు. అయోధ్యపురంలో ఈ ప్రాజెక్టు కోసం భూమి కోల్పోయిన కుటుంబాలకు ఉపాధి కల్పించాలని ప్రతినిధి బృందం కోరిందని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ చెప్పారు. లాతూర్‌తో సహా ఇతర రైల్వే ప్రాజెక్టుల మాదిరిగానే స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Read More
Next Story