
సిక్కుల ఊచకోత దోషి, కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ మృతి
ఢిల్లీ సప్ధర్ జంగ్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచిన కిరాతకుడు
ఇందిరాగాంధీ హత్య తరువాత ఢిల్లీలో అమాయక సిక్కులను ఊచకోత కోసిన ఉదంతంలో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ గురువారం మరణించాడు. అనారోగ్యం వల్ల ఆయనను జైలు నుంచి ఢిల్లీలోని సప్ధర్ జంగ్ ఆసుపత్రికి తరలించగా అక్కడే మరణించారు.
జైలు శిక్ష..
ఐదుగురు సిక్కులను కిరాతకంగా హత్య చేయడంతో పాటు ఒక గురుద్వారాను కాల్చివేసిన కేసులో ఆయన పాత్ర రుజువైంది. దీనితో 2018 లో డిసెంబర్ లో ఢిల్లీ హైకోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది.
సజ్జన్ కుమార్ ఔటర్ ఢిల్లీ నుంచి మూడుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. చాలా సంవత్సరాలుగా కాంగ్రెస్ ఒక ప్రముఖ నాయకుడిగా కొనసాగారు. 2018 లో దోషిగా తేలిన తరువాత పార్టీకి రాజీనామా చేశారు. 2025 ఫిబ్రవరిలో మరో కేసులో దోషిగా తేలిన కేసులో మరో జీవిత ఖైదు పడింది.
1984 అల్లర్ల కేసు..
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం అనేక వందల మంది సిక్కులు ఊచకోతకు గురయ్యారు. ఈ క్రిమినల్ కేసులో ఆయన గత మూడు దశాబ్దాలుగా న్యాయపరమైన కేసులు ఎదుర్కొన్నారు.
రాజ్ నగర్ కేసులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సిక్కులు కిరాతకంగా హత్యకు గురయ్యారు. దీనికి ప్రధాన కారణం సజ్జన్ కుమార్ అని తేలింది. తరువాత ఒక గురు ద్వారాను దహనం చేశారు. 2018 లో ట్రయల్ కోర్టు సజ్జన్ కుమార్ నిర్దోషి అన్న తీర్పును రద్దు చేసి, జీవిత ఖైదు విధించింది. ఆయన అదే నెల లొంగిపోయి జైలుకు వెళ్లారు.
మరో కేసులో 1984 నవంబర్ 1న సరస్వతీ విహార్ లో జస్వంత్ సింగ్, అతని కుమారుడు తరుణ్ దీప్ సింగ్ కూడా మరణించారు. ఈ కేసులన్నింటిలో అతడికీ జీవిత ఖైదుపడింది. అతని వయస్సు, అనారోగ్యం, జైలులో సత్ ప్రవర్తన కారణంగా అతడికి మరణశిక్ష నుంచి మినహాయింపు ఇచ్చారు.
Next Story

