ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర-రాష్ట్రాల మధ్య మళ్లీ మాటల యుద్ధం
x

ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర-రాష్ట్రాల మధ్య మళ్లీ మాటల యుద్ధం

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు.


రైతు గోస బీజేపీ భరోసా కార్యక్రమం తెలంగాణా జిల్లాల్లో కొనసాగుతుంది రాష్టంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తుంటే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తుంది. ధాన్యాన్ని సేకరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చెబుతున్నారు, ఇదే అంశం మీద తెలంగాణా బీజేపీ చీఫ్ ఎన్ రామ్ చందర్ రావు స్పందించారు. ధాన్యం ఎంత కొనుగోలు చేయాల్సి ఉంటుందో ఇంతవరకు కేంద్రానికి సమాచారం ఇవ్వలేదని ఆయన రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. రైతు గోస బీజేపీ భరోసా కార్యక్రమానికి అనూహ్యస్పందన వస్తుందని ఆయన తెలిపారు.తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నామని ఆయన తెలిపారు.

ప్రజలు కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు :కేంద్రమంత్రి

"ప్రజలు కాంగ్రెస్ పార్టీకి రెండున్నర ఏళ్ళ క్రితమే అధికారం ఇచ్చారు . కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసే పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అయితే ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదే అని రాష్ట్ర ప్రభుత్వం బుకాయిస్తుంది" అని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న వైఫల్యాలను ఆయన ఎండగట్టారు.


రాష్ట్రంలో 80 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారని , మంత్రులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు అని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. ఇప్పటి వరకు 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 80 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని చెప్పడం విడ్డురంగా ఉందని కిషన్ రెడ్డి వాఖ్యానించారు. మిల్లర్లతో కుమ్ముక్కై తక్కువ ధరకు రైతులు విక్రయించే దుర్మార్గపు చర్యలకు రాష్ట్రప్రభుత్వం ఒడిగట్టింది అని కేంద్ర మంత్రి ఆరోపించారు. తెలంగాణలో దళారుల మాఫియా కొనసాగుతుందని ఆయన మండిపడ్డారు. క్వింటాల్ కి రైతు 10 కిలోలు నష్ట పోతున్నట్లు ఆయన వివరించారు,రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా రైతుల నుంచి రూ 75 నుండి 80 రూపాయలు వసూలు చేస్తుందని కిషన్ రెడ్డి ఆరోపించారు.

తెలంగాణలో రైతుల ఇబ్బందులు పడుతున్నారు : రామ్ చందర్ రావు

గత ఎన్నికల సమయంలో చివరి గింజ వరకు కొనుగోలు చేస్తానన్న రేవంత్ రెడ్డి అధికారంలో రాగానే ఆ హామీలు మరిచారని తెలంగాణా బీజేపీ చీఫ్ ఎన్ రాంచందర్ రావు అన్నారు. కరీంనగర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని అన్నారు. వడ్లు , మక్కలు కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్ట పోయారని , మండే ఎండల్లో కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉన్నప్పటికీ అకాల వర్షాల వల్ల గింజలు మొలకెత్తి భారీగా నష్ట పోవాల్సి వచ్చిందని రామ్ చందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆయన ఆరోపించారు.

Read More
Next Story