క్రికెట్ మైదానం నుండి పోలీసు కెప్టెన్ గా సీవీ ఆనంద్
x
CV Anand as cricketer and as DGP

క్రికెట్ మైదానం నుండి పోలీసు కెప్టెన్ గా సీవీ ఆనంద్

పీజీ అయిపోయిన తర్వాత యూపీఎస్సీకి సీరియస్ గా ప్రిపేరై 184వ ర్యాంకు కొట్టి మొదటి సారే ఐపీఎస్ సాధించారు


యూపీఎస్సీలో ఎంపికై పోస్టింగ్ లో చేరిన ప్రతి ఐపీఎస్ అధికారి డ్రీమ్ ఏమిటంటే డీజీపీగా పనిచేయాలనే అనటంలో ఎలాంటి సందేహంలేదు. అలాంటి డ్రీమ్‌ను సీవీ ఆనంద్ నిజం చేసుకున్నారు. శుక్రవారం సీవీ ఆనంద్ పోలీస్ బాస్ డీజీపీగా బాద్యతలు తీసుకున్నారు. ఆనంద్ 1968, జూన్ 5న తెలంగాణ, రంగారెడ్డి జిల్లాలో పుట్టారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఉస్మానియా కాలేజీలో డిగ్రీ చేశారు. అలాగే మాస్టర్స్ కూడా పూర్తిచేశారు. తర్వాత యూపీఎస్సీలో ఎంపికై ఐపీఎస్ అధికారి అవ్వాలని కలలుకన్నారు. కాలేజీలో చదివేటపుడే మంచి క్రికెట్ ఆటగాడిగా పేరు తెచ్చుకున్నారు. 1986లో అండర్ 19 క్రికెట్ జట్టుకు ఎంపికై భారత్ తరపున ఇంగ్లాండ్‌కు వెళ్ళి మ్యాచ్ లు ఆడారు. ఆంధ్రా తరపున అప్పట్లో మ్యాచ్‌లు కూడా ఆడారు. ఆ సమయంలో క్రికెట్ ఆటగాడిగానే కెరీర్ మలుచుకోవాలా లేకపోతే చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలా అనే సమస్య ఎదురైంది. అప్పుడు ఎంతో ఇష్టమైన క్రికెట్‌ను పక్కన పెట్టి చదువుకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆనంద్‌కు క్రికెట్ తో పాటు టెన్నిస్ అంటే కూడా బాగా ఇష్టం.

ఇక పీజీ అయిపోయిన తర్వాత యూపీఎస్సీకి సీరియస్ గా ప్రిపేరై 184వ ర్యాంకు కొట్టి మొదటి సారే ఐపీఎస్ సాధించారు. 1991వ బ్యాచ్‌కు చెందిన ఆనంద్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఏఎస్పీ, ఎస్పీగా వివిధ జిల్లాల్లో పనిచేశారు. తర్వాత హైదరాబాద్ కమిషనర్ గా రెండుసార్లు పనిచేశారు. సైబరాబాద్ కమిషనర్ గా, యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్ జనరల్‌గా పనిచేసి బాగా పేరు తెచ్చుకున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు బాస్ గా కూడా పనిచేశారు. ఏ విభాగంలో పనిచేసినా తనదైన ముద్ర వేసుకోవటం ఆనంద్ కు మొదటినుండి అలవాటు. టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్ పై ఆనంద్ ఎక్కువ ఆధారపడుతారు అనటంలో సందేహంలేదు. మహిళ భద్రత కోసం షీ టీమును, డ్రగ్స్ అండ్ సైబర్ క్రైమ్స్ ను అరికట్టేందుకు ఎన్నో యాప్ లు, వ్యవస్ధలను ఏర్పాటుచేశారు.

లలితా ఆనంద్ గురించి

లలిత చెన్నై ఐఐటిలో చదివారు. కాలేజీ ప్రోగ్రాముల్లో లలితను ఒకసారి కలిసిన ఆనంద్ తొలిచూపులోనే ఇష్టపడ్డారు. చదువుకునే సమయంలో లలితతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి తర్వాత పెళ్ళితో ఒకటయ్యారు. వివాహం తర్వాత కొంతకాలం పూర్తిగా గృహిణిగానే ఉండిపోయారు. భర్త ఉద్యోగంలో, పిల్లలు స్కూల్లో బిజీ అయిన తర్వాత మళ్ళీ చదువు మొదలుపెట్టారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ రీసెర్చర్ చేరి అక్కడే ప్రొఫెసర్ స్ధాయికి ఎదిగారు. ఎకడమిక్ గానే కాకుండా లలితకు భరతనాట్యంలో కూడా మంచి ప్రవేశముంది. ఎన్నో ప్రదర్శనలిచ్చారు. చిన్నప్పటినుండి పాటలు పాడటం, నాట్యంచేయటం అంటే లలితకు చాలా ఇష్టం. మొత్తంమీద సీవీ ఆనంద్, లలితా ఆనంద్ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే చెప్పాలి. అలాగే పెద్ద కొడుకు చామ మిళింద్ హైదరాబాద్ తరపున క్రికెట్ ఆడుతున్నాడు.


మొన్నటివరకు హోంశాఖకు సెక్రటరీగా పనిచేసిన సీవీ ఆనంద్ ఈరోజు డీజీపీగా బాధ్యతలు తీసుకున్నారు. పోలీసు విధుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి మంచి ఫలితాలు రాబట్టిన ఆనంద్ అంటే పోలీసు డిపార్ట్ మెంట్లో చాలా మంచిపేరుంది. తనదైన స్టైల్లో తెలంగాణలో నేరాల నియంత్రణకు, నేర పరిశోధనలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తీసుకువస్తారని ఆశిద్దాం.

Read More
Next Story