
ఇరాన్ నుంచి ఇండియాకు వయా లక్షద్వీప్
మూడు వేల కోట్ల మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, అడ్డుకున్న కోస్ట్ గార్డ్
ఇరాన్ నుంచి భారత్ లోని లక్ష ద్వీప్ కు అక్రమంగా తరలిస్తున్న మూడు వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాల నౌకను భారత కోస్ట్ గార్డు పట్టుకుంది. కోస్ట్ గార్డ్ ప్రకారం, ఆ పడవలో 526 కిలోల హెరాయిన్, మెథాంఫేటమిన్ ఉండగా, అందులో ఐదుగురు పాకిస్తానీ జాతీయులు ఉన్నట్లు గుర్తించారు.
గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS)తో కలిసి సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. లక్షద్వీప్ తీరంలో ఇరాన్ పడవను అడ్డగించారు. "అడ్డగించిన పడవ, సిబ్బంది, స్వాధీనం చేసుకున్న నిషేధిత వస్తువులను సంయుక్త విచారణ, సమగ్ర బహుళ-సంస్థల న్యాయపరమైన చర్యల కోసం సాయుధ భద్రతతో ముంబైకి తరలించాము" అని కోస్ట్ గార్డ్ తెలిపింది.
నిఘా సమాచారం ఆధారంగా సముద్ర, వాయు నిఘా ద్వారా ఆ నౌకను ట్రాక్ చేశారు. ఆ తర్వాత కోస్ట్ గార్డ్ సిబ్బంది సెప్టెంబర్ 25న దానిని వెంబడించి, స్వాధీనం చేసుకున్నారు.
“చర్య తీసుకోదగిన నిఘా సమాచారం ఆధారంగా కచ్చితమైన సముద్ర-వాయు నిఘాను నిర్వహిస్తూ, భారతీయ తత్రక్షక్ సిబ్బంది తీవ్ర వెంబడింపును ప్రారంభించడానికి ముందు నిరంతరాయంగా ట్రాక్ చేశారు. లక్ష్యాన్ని నిర్వీర్యం చేసి, సెప్టెంబర్ 25, 2026న అనుమానాస్పద ఇరాన్ ధో నౌకను స్వాధీనం చేసుకున్నారు,” అని ఒక ప్రకటనలో తెలిపింది.
హెరాయిన్, మెథాంఫేటమిన్ స్వాధీనం..
స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను సిబ్బందితో పాటు విచారణ, పలు ఏజెన్సీల ద్వారా తదుపరి చట్టపరమైన చర్యల కోసం ముంబైకి తీసుకువెళుతున్నారు. అక్రమ మాదకద్రవ్యాలు భారత ప్రధాన భూభాగానికి చేరకుండా నిరోధించడం, సముద్ర మార్గ స్మగ్లింగ్‌లో పాలుపంచుకుంటున్న నెట్‌వర్క్‌లను అడ్డుకోవడం ఈ ఆపరేషన్ లక్ష్యమని కోస్ట్ గార్డ్ తెలిపింది.
“శత్రు విదేశీ సిండికేట్ల ఆర్థిక యంత్రాంగాన్ని దెబ్బతీయడం ద్వారా, విషపూరిత సింథటిక్ పదార్థాలు ప్రధాన భూభాగ తీరాలకు చేరకముందే వాటిని అడ్డుకోవడం ద్వారా, ఈ మిషన్ ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ అనే ప్రభుత్వ దార్శనికతకు ఒక కీలకమైన శక్తి గుణకంగా పనిచేస్తుంది,” అని కోస్ట్ గార్డ్ పేర్కొంది. “దేశ సముద్ర సరిహద్దులను రక్షించడానికి, దేశ యువతను మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడటానికి, సముద్ర రంగంలో సంపూర్ణ భద్రతను నెలకొల్పడానికి భారతీయ తత్రరక్షక్ పూర్తిగా సన్నద్ధంగా ఉంది” అని వెల్లడించింది.
Next Story

