
అజారుద్దీన్‌కు బిగ్ రిలీఫ్..
మంత్రి పదవి పదిలం. కోదండరాంకూ ఎమ్మెల్సీ.
అజారుద్దీన్, కోదండరాంకు ఎమ్మెల్సీ పదవుల ఫైల్‌కు తెలంగాణ గర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారిద్దరి నియామకాన్ని ఆమోదిస్తూ శనివారం వారి ఫైల్‌పై సంతకం చేశారు. గవర్నర్ నిర్ణయంతో అజారుద్దీన్‌కు భారీ ఊరట అందింది. ఇంతకాలం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకుండా మంత్రి పదవిలో ఉన్నాయ ఆయనకు ఆరు నెలల డెడ్‌లైన్ దగ్గర పడింది. దీంతో ఆయన మంత్రి పదవి ఊడుతుందా? అన్న చర్చలు జోరుగా సాగాయి. అజారుద్దీన్, కోదండరాంను ఎమ్మెల్సీలు నియమించడానికి గవర్నర్ ఆమోదం కూడా లభించకపోవడంతో ఇంతకాలం అజారుద్దీన్ మంత్రిపదవి గాల్లో దీపంలా ఉంది. అయితే ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాస్ శుక్లా ఆమోద ముద్ర వేసేశారు. దీంతో అజారుద్దీన్ మంత్రి పదవి సేవయింది.
సాధారణంగా మంత్రి పదవి అందుకోవాలంటా సదరు నేత ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ అయి ఉండాలి. కొన్ని సందర్భాల్లో మంత్రి పదవి అందుకున్న తర్వాత ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నికయినా సరిపోతుంది. ఈ రూల్‌ను వినియోగించుకునే అజారుద్దీన్‌కు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి అందించింది. కాగా తెలంగాణ క్యాబినెట్‌లో ఉన్న అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే అవ్వడానికి ఏప్రిల్ 30 వరకే గడువు ఉంది. దీంతో ఆయన పదవి పరిస్థితి ఏంటి? అన్న చర్చ తీవ్రంగా జరిగింది. ఈ క్రమంలోనే అజారుద్దీన్, కోదండరాంకు ఎమ్మెల్సీలుగా నియమించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివిధాలా ప్రయత్నాలు చేసింది. తాజాగా తెలంగాణ నూతన గవర్నర్ శుక్లా.. వీరి నియామకానికి ఆమోద ముద్ర వేశారు.

