
తెలంగాణలో మండే ఎండలు...
తెలంగాణలో హీట్‌వేవ్ 2.0 హాహాకారం: పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్
ఆరు రోజులు అగ్నిపరీక్ష
తెలంగాణ రాష్ట్రాన్ని మరోసారి ఎండల ముప్పు చుట్టుముట్టింది. శుక్రవారం (ఏప్రిల్ 24) నుంచి ఆరు రోజుల పాటు తీవ్ర వడగాలులు వీచనున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశం ఉందని పేర్కొంటూ ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
వడగాలుల ప్రభావం
తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం నుంచి ఆరు రోజులపాటు హీట్ వేవ్ హెచ్చరికలను తెలంగాణ వెదర్ మ్యాన్ జారీ చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాలుల ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ కు పెరిగే అవకాశముందని వెదర్ మ్యాన్ హెచ్చరించారు. ఉత్తర తెలంగాణలోని జిల్లాలకు వారం రోజుల పాటు రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
శుక్రవారం నుంచి తీవ్రమైన వడగాలుల 2.0కు సిద్ధంగా ఉండాలని, ఏప్రిల్ 24వతేదీ నుంచి 29వ తేదీల మధ్య రెడ్ మార్క్ చేసిన జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45డిగ్రీల సెల్సియస్ కు చేరవచ్చని తెలంగాణ వెదర్ మ్యాన్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, గద్వాల్, వనపర్తి జిల్లాల్లో తీవ్ర వడగాలుల ప్రభావం వల్ల రెడ్ అలెర్ట్ ప్రకటిస్తున్నట్లు వెదర్ మ్యాన్ తెలిపారు.
తెలంగాణ వెదర్ మ్యాన్ విడుదల చేసిన హీట్ వేవ్ చిత్రపటం
హీట్‌వేవ్ 2.0 హెచ్చరిక జారీ
శుక్రవారం ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ తెలిపారు. కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, గద్వాల్, వనపర్తి, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో 43నుంచి 44డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా వేశారు. హైదరాబాద్ నగరంలో మాత్రం 41నుంచి 43డిగ్రీల సెల్సియస్ వేడి ఉంటుందని బాలాజీ వివరించారు.
ఎక్కడెక్కడ ఎంత వేడి ఉంటుందంటే?
ఉత్తర తెలంగాణ జిల్లాలు: ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి వంటి ప్రాంతాల్లో 44–45°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, గద్వాల్, వనపర్తి వంటి జిల్లాల్లో 43–44°C వరకు వేడి పెరుగుతుందని అంచనా.హైదరాబాద్ నగరంలో కూడా 41–43°C వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు.
రెడ్ అలర్ట్: ఉత్తర, తూర్పు తెలంగాణలోని పలు జిల్లాలు
ఆరెంజ్ అలర్ట్: కామారెడ్డి, సిద్దిపేట, వరంగల్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ తదితర ప్రాంతాలు
ఎల్లో అలర్ట్: మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ ప్రాంతాలు
ఆరెంజ్ అలెర్ట్
రాబోయే వారం రోజుల పాటు ఈ వేసవికాలంలో ఆరెంజ్ మార్క్ చేసిన జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43డిగ్రీల నుంచి 44డిగ్రీల సెల్సియస్ దాటవచ్చునని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. శుక్రవారం నుంచి హైదరాబాద్ నగరంలోనూ తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉంది. ఏప్రిల్ 24 నుంచి 29వ తేదీల మధ్య కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 43డిగ్రీల సెల్సియస్ కు చేరవచ్చునని, ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా, సురక్షితంగా ఉండాలని వెదర్ మ్యాన్ సూచించారు. అధిక వేడి కారణంగా అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఈ వర్షాల వల్ల పెద్దగా ఉపశమనం ఉండదని కేవలం గాలిలో తేమను పెంచుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ వెల్లడించారు.
కామారెడ్డి, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
ఏడు జిల్లాల్లో ఎల్లోఅలెర్ట్ జారీ
ఏప్రిల్ 24 వతేదీ నుంచి 29 వతేదీ వరకు ఆరు రోజులపాటు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి , మెదక్ జిల్లాల్లో ఎల్లోఅలెర్ట్ జారీ చేశారు. ఈ ఏడు జిల్లాల్లో వారం రోజులపాటు ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండవచ్చని తెలంగా వెదర్ మ్యాన్ తెలిపారు.
హీట్‌వేవ్ తర్వాత వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో వారంరోజుల పాటు హీట్‌వేవ్ 2.0 తర్వాత ఏప్రిల్ 28,29వతేదీల నుంచి శక్తివంతమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవ వచ్చని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఈ వర్షాలతోపాటు మే 1వ వారం వరకు పిడుగులు పడే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ హెచ్చరించారు.
తూర్పు తెలంగాణ జిల్లాలంటే కొమురం భీం ఆసిఫాబాద్ నుంచి సూర్యాపేట వరకు, ఉత్తర, మధ్య ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం నుంచి గుంటూరు బెల్ట్ వరకు పెను తుపానుకు హాట్‌స్పాట్ కానుందని వెదర్ మ్యాన్ తెలిపారు.
తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఐఎండీ విడుదల చేసిన చిత్రపటం
ఐఎండీ హెచ్చరికల జారీ
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల మేరకు పెరుగుతాయని భారతవాతావరణశాఖ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, కామారెడడి జిల్లాల్లో తీవ్ర వడగాలులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. గంటకు 30నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఈ నెల 24 నుంచి 28వతేదీ వరకు తీవ్ర వడగాలులతో పాటు మోస్తరు వర్షాలు కురవ వచ్చని ఐఎండీ విడుదల చేసిన వెదర్ రిపోర్టులో వెల్లడించారు.
ప్రజలకు సూచనలు : మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు వెళ్లకుండా ఉండాలి.ఎక్కువగా నీళ్లు, ద్రవాలు తీసుకోవాలి.తేలికపాటి దుస్తులు ధరించాలి.పిల్లలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
వచ్చే ఆరు రోజులు తెలంగాణ ప్రజలకు అగ్నిపరీక్షగా మారనున్నాయి. ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండటం అత్యవసరం. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, బహిరంగంగా పనిచేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హీట్‌వేవ్ తర్వాత వర్షాలు కురిసే సూచనలు ఉన్నప్పటికీ, అప్పటివరకు ఈ ఎండల ప్రభావాన్ని తట్టుకోవడం తప్ప మార్గం లేదు. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత ముఖ్యమైంది.
Next Story

