Big Breaking : ఝార్ఖండ్ లో భారీ ఎన్ కౌంటర్, 15 మంది మావోలు మృతి
x
File photo

Big Breaking : ఝార్ఖండ్ లో భారీ ఎన్ కౌంటర్, 15 మంది మావోలు మృతి

భద్రతాదళాల నుండి తప్పించుకునేందుకు అడవుల్లో కాల్పులుజరుపుతునే మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు.


ఝార్ఖండ్, పశ్చిమ సింగ్బూంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం నుండి భద్రతాదళాలకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు 15 మంది మావోయిస్టులు చనిపోయినట్లు సమాచారం. చనిపోయిన వారిలో కేంద్ర కమిటి సభ్యుడు పతిరామ్ మాంఝీ కూడా ఉన్నట్లు భద్రతాదళాలు గుర్తించాయి. మాంఝీపై రు. 5 కోట్ల రివార్డుంది. ఉదయం మొదలైన కాల్పులు ఇప్పటికీ జరుగుతునే ఉన్నాయి. ఈ కాల్పుల్లో ఎంతమంది చనిపోయారు ? ఎంతమంది తీవ్రంగా గాయపడ్డారనే విషయంపై స్పష్టత లేదు. కాల్పులు జరుపుతు మావోయిస్టులను భద్రతాదళాలు తరుముతున్నాయి.

భద్రతాదళాల నుండి తప్పించుకునేందుకు అడవుల్లో కాల్పులుజరుపుతునే మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు. మావోయిస్టులను తరుముతు ముందుకు వెళుతున్న భద్రతాదళాలకు అక్కడక్కడ బుల్లెట్ గాయాలతో చనిపోయిన మావోయిస్టుల దేహాలు కనబడుతున్నాయి. ఈ లెక్కల ప్రకారమే ఇప్పటికి 15 మంది చనిపోయినట్లు లెక్కేశారు. పూర్తి వివరాలు ఇంకా రావాల్సుంది.

Read More
Next Story