నర్సంపేటలో ‘డెడ్ బాడీ’ పంచాయితీ..
x

నర్సంపేటలో ‘డెడ్ బాడీ’ పంచాయితీ..


నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ మృతదేశం విషయంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆర్టీసీ సంస్థ కోసం ప్రాణ త్యాగం చేసిన శంకర్ గౌడ్ మృతదేశాన్ని డిపోలోకి తీసుకుపోవాలని కార్మికులు ప్రయత్నిస్తున్నారు. కాగా వరిని పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో నర్సంపేట మండలం ముత్తోజిపేట గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీటి కారణంగా శంకర్ గౌడ్ మృతదేహం దాదాపు రెండు గంటల నుంచి నడిరోడ్డుపైనే ఉండిపోయింది. శంకర్ గౌడ్ మృతదేహాన్ని వాళ్ల ఇంటి దగ్గరకు తీసుకెళ్లాలని, అక్కడే ఎటువంటి కార్యక్రమమైనా చేసుకోవాలని పోలీసులు అన్నారు. కాగా తమ తోటి కార్మికుడి మృతదేహాన్ని డిపో వరకు తీసుకెళ్లాల్సిందేనని ఆర్టీసీ కార్మికులు పట్టుబట్టి డిమాండ్లు చేస్తున్నారు. ఇదే సమయంలో శంకర్ గౌడ్ మృతదేహాన్ని తీసుకొస్తారు, ఆయనకు నివాళులు అర్పించాలి అని నర్సంపేట ముత్తోజిపేటలోని వారి ఇంటి దగ్గర, బస్ డిపో దగ్గరకు వందల మంది ఆర్టీసీ కార్మికులు చేరుకున్నారు. దీంతో పోలీసులు భారీ సంఖ్యలో శంకర్ గౌడ్ ఇంటి దగ్గర కూడా మోహరించారు.

ఈ విషయంలో కేంద్రమంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిలిచారు. ఈ విషయంలో పోలీసులు వైఖరిని ఆయన తప్పుబట్టారు. ఎవరు అడ్డుకుంటారో చూస్తాం.. మీరు తీసుకెళ్లండి అంటూ ఆర్టీసీ కార్మికులకు తెలిపారు. అయితే పోలీసులు ఆర్టీసీ కార్మికులకు అడ్డుకున్నారు. భారీ సంఖ్యలో పోలీసులు అక్కడకు చేరుకోవడం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇంకా నర్సంపేటలో శంకర్ గౌడ్ మృతదేహం విషయంతో తీవ్ర పంచాయితీ జరుగుతోంది.

ప్రభుత్వం కీలక ప్రకటన

ఇదే సమయంలో శంకర్ గౌడ్ అంశంలో ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని చెప్పారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి వెల్లడించారు. ఎక్స్‌గ్రేషియాతో పాటు ఆయన కుటుంబానికి ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా కేటాయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సమయంలో శంకర్ గౌడ్ కుటుంబానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వ్యక్తిగతంగా రూ.5లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

Read More
Next Story