పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని టీవీకే ఎలా అధిగమించింది?
x

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని టీవీకే ఎలా అధిగమించింది?

అన్నాడీఎంకే నేతలతో రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకుంటున్న విజయ్


Click the Play button to hear this message in audio format

కర్ణాటక లో కొన్ని సంవత్సరాల క్రితం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సామూహికంగా రాజీనామా చేయడంపై 2019 లో సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. రాజకీయ ఒత్తిడితో శాసనసభ్యులు రాజీనామా చేసినప్పుడూ వారు స్వచ్ఛందంగానే అలా చేశారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వ్యక్తిగత ఆలోచనలు, ప్రజా జవాబుదారీతనానికీ మధ్య ఉన్న వ్యత్యాసమే ఇప్పుడు తమిళనాడు వివాదానికి కేంద్రమైంది.

ఆరుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామాలను తమిళనాడు స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ఆమోదించడాన్ని మద్రాస్ హైకోర్టు అక్టోబర్ 13 న ఇచ్చిన తీర్పులో సమర్దించింది. ఇద్దరు మాజీ శాసనసభ్యుల అనర్హత ప్రక్రియలు ఇంకా అపరిష్కృతంగానే ఉంది.
ఒక వ్యక్తి ఒక పార్టీ తరఫున గెలిచి, తిరిగి రాజీనామా చేసి మరో పార్టీ తరఫున ఎన్నిక కావడం అనేది ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని బలహీనపరుస్తుందని ఆందోళన తక్షణ ప్రాముఖ్యం సంతరించుకుంది. పార్టీ ఫిరాయింపుకు ముందు జరిగిన ప్రవర్తనపై అధికారిక నిర్ణయం వెలువడక ముందే ఒక కొత్త ఆదేశం వచ్చినట్లు అయింది.

రాజీనామా.. పెండింగ్ లో ఉన్న కేసులు...

మే నెలలో జరిగిన విశ్వాస తీర్మానంలో ఆరుగురు శాసనసభ్యులు తమ పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. స్పీకర్ వారి రాజీనామాలను ఆమోదించగా, వారందరూ తదనంతరం టీవీకేలో చేరారు. ఆరు రాజీనామాలకు సంబంధించిన ఐదు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ప్రతి సందర్భంలోనే అది రాజీనామాలను ఆమోదించింది.
నాలుగు అనర్హత పిటిషన్ లు స్పీకర్ పరిశీలనలో ఉన్నాయి. నాలుగు నెలలకు పైగా గడిచినప్పటికీ, ఆలస్యానికి సంతృప్తికరమైన వివరణలు లేకుండా కేవలం నోటీస్ లు మాత్రమే జారీ చేశారని కోర్టు విచారణలో తేలింది.
ఎన్నికలను వేర్వేరుగా సవాల్ చేయడం వల్ల ఉప ఎన్నికలు ఆలస్యమయ్యాయి. పిటిషనర్లు వేరొక అభ్యర్థిని ఎన్నికైనట్లు ప్రకటించాలని కోరడంతో అదే స్థానానికి పోటీ దావాలు వచ్చే అవకాశం ఉన్నందున హైకోర్టు మొదట తాజాగా జరిగే ఎన్నికలను నిలిపివేసింది. అయితే ఆ తరువాత వచ్చిన ఆదేశాలు పెరుందరై, అంబాసముద్రంలో పరిస్థితిని మార్చాయి. అయినప్పటికీ పూర్తయిన అక్టోబర్ ఉప ఎన్నికల రౌండ్ లో ఈ రెండింటిని చేర్చలేదు.

స్వచ్చంద రాజీనామాలేనా?

ఆర్టికల్ 190(3)(బీ) ప్రకారం.. అసెంబ్లీకీ ఎన్నికైన సభ్యుని రాజీనామా నిజమైనదా, స్వచ్ఛందమైనదా అని స్పీకర్ పరిశీలిస్తారు. శ్రీమంత్ బాలసాహెబ్ పాటిల్ వర్సెస్ స్పీకర్, కర్ణాటక శాసనసభ, ఆదర్స్ (2019) కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఇది కేసు విచారణను ప్రామాణికత, స్వేచ్ఛా సంకల్పానికి మాత్రమే పరిమితం చేస్తుంది. బలవంతంగా, అనుచిత ప్రభావం ద్వారా రాజీనామా చేస్తే వేరే పరిశీలనకు దారితీస్తుంది. కానీ ఒక శాసనసభ్యుని రాజకీయ కారణాలతో విభేదించడం అతని సభ్యత్వాన్ని కొనసాగించమని బలవంతం చేయడాన్ని సమర్థించదు.
ఇక్కడ మద్రాస్ హైకోర్టు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అఫిడవిట్లపై ఆధారపడింది. వారు స్వేచ్ఛగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావించింది. ఆర్థిక లావాదేవీలు, బేరసారాల ఆరోపణలను అది ఉద్దేశానికి సంబంధించిన ప్రశ్నలుగా పరిగణించింది. ఆరోపించబడిన బేరసారాల గురించి తెలిసి ఉందనే భావన కూడా, అనర్హతలను విడిగా పరిశీలిస్తున్న సందర్భంలో రాజీనామాలను ఆమోదించకుండా స్పీకర్ ఆపాల్సిన పనిలేదని అది వాదించింది. నిజానికి ఆరోపణలు వచ్చిన లావాదేవీలపై వాస్తవంగా ఎలాంటి విచారణ జరగలేదు.
ఆ పరిమిత విచారణ ఒక ముఖ్యమైన స్వేచ్ఛను కాపాడుతుంది. ఉద్దేశాలను విచారించడానికి అనియంత్రిత అధికారం ఉంటే పక్షపాత ధోరణి గల స్పీకర్ తన రాజకీయ సౌలభ్యం కోసం ఒక సభ్యుని నిష్క్రమణను అడ్డుకోవచ్చు.
కానీ ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే... ప్రేరణ అనేది ఒత్తిడితో పాటు కోరిక ద్వారా కూడా పని జరుగుతుంది. ఒక ఎమ్మెల్యే ఆకర్షణీయమైన ప్రతిపాదనను ఇష్టపూర్వకంగా స్వీకరించవచ్చు. సమ్మతిని నిర్దారించడం వ్యక్తిగత ఎంపిక అనే ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. కానీ జవాబుదారీతనం కోసం ఏమి ప్రతిపాదించింది. ఎప్పుడూ, ఏ ప్రజా కార్యానికి ప్రతిఫలంగా ప్రతిపాదించబడింది అనే విషయాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది.
మరో పార్టీలో చేరమని ఆహ్వానం, అభ్యర్థిత్వ వాగ్థానం, విశ్వాస తీర్మానికి సంబంధించిన ఆరోపిత చెల్లింపుల వంటి వాటికి వేర్వేరు చట్టపరమైన విశ్లేషణలు అవసరం. ప్రతి దానిని సాక్ష్యాధారాలతో, సంబంధిత ప్రజా బాధ్యతతో సరిపోల్చి పరిశీలించాలి. ఒక నిర్దిష్ట ఏర్పాటు గుర్తించదగిన రాజ్యాంగ లేదా శాసనపరమైన బాధ్యతలను ఉల్లంఘించిందా లేదా అనేదే ఇక్కడ అసలైన ప్రశ్న.

మునుపటి ప్రశ్నలు..

ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్న పదో షెడ్యూల్, పార్టీ సభ్యత్వం వదులుకోవడం, ముందస్తు అనుమతి లేకుండా పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటు వేయడం అనే రెండు విషయాలను ప్రస్తావిస్తుంది. ఇది ఓటింగ్ ఉల్లంఘనను 15 రోజులలోపు మన్నించడానికి లేదా అధికారికంగా మినహాయించడానికి పార్టీకి వీలుకల్పిస్తుంది.
ప్రవర్తనను బట్టి సభ్యత్వాన్ని వదులుకున్నట్లు ఊహించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అందువల్ల రాజీనామాకు ముందు పార్టీ మారడానికి కుదిరిన ఒప్పందం అనర్హతకు సంబంధించి ఉండవచ్చు. ఈ నిర్ధారణ శాసనసభ్యుడు ఏం చెప్పారు.. దేనీకి అంగీకరించారు.. లేదా ఏం చేశారనే సాక్ష్యంపై ఆధారపడి ఉండాలి.
సభ్యుడి నిష్క్రమణ పూర్తిగా స్వచ్ఛందమైనప్పటికీ రాజీనామాకు ముందు ప్రవర్తన అసలు పార్టీని విడిచిపెట్టినట్లుగా నిర్ధారించవచ్చు. ఒక ఓటును మన్నించడం, పార్టీని విడిచిపెట్టారన్న వేరొక ఆరోపణను పరిశీలించడం అనేవి వేర్వేరు ప్రశ్నలు.. ప్రతిదానికి దాని స్వంత వాస్తవిక ఆధారం అవసరం.
అయితే ఇది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అయిన సీ. విజయ్ భాస్కర్, ఎం ఆర్ విజయ్ భాస్కర్ లకు ముఖ్యమైనది. వారి ప్రవర్తనను పార్టీ మన్నించిన తరువాత వారిపై గతంలో దాఖలైన అనర్హత కేసులను ఉపసంహరించుకున్నారు. వారిద్దరిపైన కొత్త పిటిషన్ ఏది తీర్పులో రాలేదు. పార్టీ ఫిరాయింపు జరిగిందని నిర్ధారణ కోరే పక్షం, సంబంధిత ఆరోపణలను స్పీకర్ ముందు ఉంచాలి.
రాజీనామాకు ముందు జరిగిన అనర్హతకు దారితీసే ప్రవర్తన ఆరోపణలపై నిర్ణయం తీసుకునే స్పీకర్ అధికారాన్ని కర్ణాటక తీర్పు పరిరక్షిస్తుంది. ఆ రక్షణ చాలా అవసరం. ఎందుకంటే లేకపోతే ఎన్నికైన సభ్యుడు పదవి నుంచి వైదొలగడం అనేది ఆ సభ్యుడు పదవిలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలకు సంబంధించిన విచారణలకు ఆటంకం కలిగించవచ్చు.
లంచం జరిగిందని విశ్వసనీయమైన సాక్ష్యం ఉన్నచోట, క్రిమినల్ చట్టం ఒక ప్రత్యేక మార్గం అందిస్తుంది. సభలో ఓటు లేదా ప్రసంగానికి సంబంధించి లంచం తీసుకున్నందుకు శాసనసభ్యులపై విచారణ జరపవచ్చని సీతా సోరెన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా(2024) కేసులో సుప్రీంకోర్టు తీర్పు ధృవీకరిస్తుంది.
రాజీనామాకు సంబంధించిన ఆరోపిత బేరసారాలపై వర్తించే క్రిమినల్ చట్టం కింద పరిశీలించాల్సి ఉంటుంది. రాజ్యాంగపరమైన అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. కాగా దర్యాప్తు అధికారులు, క్రిమినల్ కోర్టులు సక్రమంగా నిరూపించబడిన ఏవైనా క్రిమినల్ ఆరోపణలను పరిశీలిస్తాయి. ప్రతి ప్రక్రియకు నిర్ణయించబడుతున్న అంశానికి తగిన రుజువు అవసరం.
ప్రతి ఎమ్మెల్యేకు నిష్పక్షపాత విచారణలో ఆరోపణలకు సమాధానం చెప్పే హక్కు ఉంది. ఏ నిర్ధారణ అయినా స్థాపిత వాస్తవాలను అనుమానాల నుంచి వేరు చేసి చూపాలి. ఏ నేర విచారణకైనా ఇదే సాక్ష్య క్రమశిక్షణ మార్గదర్శకంగా ఉండాలి.

ఆలస్యం వల్ల...

రాజ్యాంగపరమైన శిక్షలు స్వల్పకాలికంగా ఉండవచ్చు. ఆర్టికల్ 164(1బీ) ప్రకారం ఫిరాయింపు కారణంగా మంత్రి పదవి నుంచి అనర్హుడైన శాసనసభ్యుడు అతని అసలు పదవీకాలం ముగిసే వరకూ లేదా ఆ సభ్యుడు తిరిగి ఎన్నికయ్యే వరకూ ఈ రెండింటిలో ఏది ముందు జరిగితే అది వరకూ ఆ పదవిలో కొనసాగకుండా నిషేధించబడతాడు. ఆర్టికల్ 361బీ ప్రకారం నిర్దిష్ట వేతన రాజకీయా పదవులపై ఇదే విధమైన పరిమితిని విధిస్తుంది.
అనర్హతకు గురైన శాసనసభ్యుడిని అసెంబ్లీ పదవీకాలం మిగిలిన కాలానికి ఎన్నికలలో పోటీ చేయకుండా స్పీకర్ నిషేధించలేరని కర్ణాటక తీర్పు కూడా నిర్ధారిస్తుంది. అందువల్ల తిరిగి ఎన్నిక కావడం అనేది అనర్హతతో ముడిపడి ఉన్న పరిమితులను గణనీయంగా తగ్గించగలదు.
టీవీకే సాధించిన రెండు విజయాలు సమయం ఎందుకు ముఖ్యమే తెలియజేస్తున్నాయి. పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై తుది నిర్ణయం వెలువడకముందే ఓటర్లు కొత్త అభ్యర్థిత్వాలను ఆమోదించారు. ఒకవేళ పార్టీ ఫిరాయింపు జరిగినట్లు తరువాత తేలినా, వారి ప్రస్తుత పరిస్థితిపై దాని ప్రభావం పెద్దగా ఉండదు. ఎందుకంటే తిరిగి ఎన్నికైతే మంత్రి పదవి చేపట్టడంపై ఉన్న ఆంక్షలు తొలగిపోతాయి. ఈ జాప్యం వల్ల ఓటర్లు తమ ఓటు వేయడానికి ముందే ఆ ఆరోపణలపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశాన్ని కూడా కోల్పోయారు.
విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ 2023 లో చేసిన ఒక అధ్యాయనం, ఫిరాయింపుల నిరోధక వ్యవస్థలోని బలహీనతలుగా పక్షపారిత తీర్పులు, జాప్యాన్ని గుర్తించింది. రాజకీయా పార్టీల సంస్కరణల కోసం దాని ప్రతిపాదనలు, అవకాశాలను కల్పించి, ఫిర్యాదులను స్వీకరించే సంస్థల ప్రవర్తనపై కూడా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. జవాబుదారీతనం నిలబడుతుంది. లేకపోతే పదవిని విడిచిపెట్టే స్వేచ్ఛ తక్షణమే అమల్లోకి వస్తుంది. కానీ రాజకీయ ప్రయోజనాలు పొందిన తరువాతే మునుపటి ప్రవర్తనపై పరిశీలన జరుగుతుంది.
శాసనసభ్యులు రాజీనామా చేయడానికి ముందు రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించారా లేదా అనే విషయాన్ని స్పీకర్ ఇప్పుడు సాక్ష్యాధారాల ఆధారంగా నిర్ధారించాలి. స్వచ్ఛందంగా వైదొలగడం, కొత్త ఆదేశం పొందడం అనేవి గతంలో చేసిన ప్రవర్తనకు జవాబు చెప్పాల్సిన బాధ్యతతో పాటే కొనసాగవచ్చు. ఆ జవాబును ప్రజలు ఎటువంటి జాప్యం లేకుండా తెలుసుకునే హక్కు ఉంది.
Read More
Next Story