డిజిటల్ ఇండియా కోసమే మోదీని కలిశా : డాక్టర్ ప్రీతిరెడ్డి వివరణ
x
మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి

డిజిటల్ ఇండియా కోసమే మోదీని కలిశా : డాక్టర్ ప్రీతిరెడ్డి వివరణ

బీజేపీలో చేరడం లేదని స్పష్టం


హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) బోధనకు డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించామని డాక్టర్ ప్రీతిరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమం పూర్తిగా విద్యాభివృద్ధి కోసమేనని ఆమె స్పష్టం చేశారు.

మల్లారెడ్డి యూనివర్శిటీలో చదువుతున్న విద్యార్థులకు ఏఐ నేర్పించేందుకు డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మల్లారెడ్డి విద్యాసంస్థల ఉపాధ్యక్షురాలు, మాజీమంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి శుక్రవారం బీజేపీ కార్యాలయంలో మీడియాకు చెప్పారు. తాను విద్యావేత్తనని, డాక్టరును అని తన కింద ఉన్న విద్యార్థులను ప్రమోట్ చేసేందుకు తాను మోదీతో పాటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలను కలుస్తానని స్పష్టం చేశారు. తాను ఒక పార్టీని తాను ఎంపిక చేసుకోలేదన్నారు. బీజేపీలో తాను చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆమె స్పష్టం చేశారు.తాను కాంగ్రెస్ మంత్రితో కూడా టచ్ లో ఉంటున్నానని తెలిపారు. తాను బీజేపీ నేతలను కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని చెప్పారు.

లక్షమంది విద్యార్థులతో సామూహిక వందేమాతర గీతాలాపన

డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా లక్షమంది విద్యార్థులతో సామూహిక వందేమాతర గీతాలాపన కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆహ్వానించినట్లు ప్రీతి రెడ్డి చెప్పారు. తమ కార్యక్రమానికి ప్రధాని మోదీ వస్తే పెద్ద ఈవెంట్ అవుతుందన్నారు. అందులో భాగంగానే శుక్రవారం బీజేపీ కార్యాలయంలో చంద్ర శేఖర్ తివారీని కలిసి ఆహ్వానించినట్లు ఆమె తెలిపారు.తన మామ మల్లారెడ్డి బీఆర్ఎస్‌లోనే ఉంటారని ప్రీతి రెడ్డి వివరించారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ప్రీతిరెడ్డి

తాను ప్రధాని మోదీని కలవడానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని డాక్టర్ ప్రీతిరెడ్డి స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరడం లేదని చెప్పారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఏఐ టెక్నాలజీ ద్వారా మెడిసిన్, డెంటల్,టెక్నాలజీ,అలైడ్ హెల్త్, ఫార్మసీ విద్యార్థులకు బోధిస్తామని, ఈ కార్యక్రమం కోసం తాను అన్ని పార్టీల నేతలను తాను కలుస్తాననని ప్రీతిరెడ్డి చెప్పారు.

బీజేపీ నేతలతో వరుస భేటీలు

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి శుక్రవారం హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో భేటి అయ్యారు. తన మామ మాజీమంత్రి చామకూర మల్లారెడ్డితోపాటు ప్రీతిరెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలిశారు.తాను కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో టచ్‌లో ఉన్నది వాస్తవమే అని అన్నారు. అయితే బీజేపీలో చేరతానంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. మళ్లీ హైదరాబాద్ వచ్చాక బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావును కలిసి మాట్లాడారు. తాను గతంలో కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ లను కలిశానని చెప్పారు. మోదీ వస్తున్నారంటే బీజేపీ నేతలందరిని తాను కలిసి వారిని ఆహ్వానిస్తున్నానని చెప్పారు.

రాజకీయాలకతీతంగా విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీల నేతలను కలుస్తున్నామని ప్రీతిరెడ్డి తెలిపారు. ఏఐ ఆధారిత విద్యతో విద్యార్థులకు కొత్త అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమం నిలవనుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.


Read More
Next Story