ఫారెస్ట్ అధికారులకు సర్కార్ స్వీట్ న్యూస్
x

ఫారెస్ట్ అధికారులకు సర్కార్ స్వీట్ న్యూస్

2020-23 సెలెక్ట్ లిస్టులు ఆమోదం. పలు అధికారుల పేర్లు ఖరారు, రాష్ట్రానికి ప్రమోషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం.


తెలంగాణ ఫారెస్ట్ అధికారుల ప్రమోషన్లకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. చాలా కాలంగా ఈ ప్రమోషన్ల అంశం హోల్డ్‌లో ఉంది. తాజాగా ఈ అంశంలో కీలక ముందడుగు పడింది. 2020 నుంచి 2023 వరకు సెలెక్ట్ లిస్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఈ జాబితాలను ఆమోదించింది. యూపీఎస్సీ సిఫార్సుల మేరకు 1966 నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. 2020 సెలెక్ట్ లిస్టులో ఐఐ ప్రకాశ్, జీ ముఖుంద్ రెడ్డి పేర్లు ఉన్నాయి. 2021 జాబితాలో ఐఐ ప్రకాశ్‌తో పాటు ఏ నరసింహ రెడ్డి, డీ సంహిత చోటు పొందారు.

2022 జాబితాలో ఐఐ ప్రకాశ్, ఎం జోజి, జీబీ రేఖా బాను, సీహెచ్ గంగా రెడ్డి పేర్లు చేరాయి. 2023 సెలెక్ట్ లిస్టులో ఐఐ ప్రకాశ్, ఎస్ రాజశేఖర్‌కు స్థానం లభించింది. అయితే ఐఐ ప్రకాశ్ పేరు నాలుగు జాబితాల్లో ఉన్నప్పటికీ, ఆయన ప్రమోషన్ తాత్కాలికంగా పరిగణించబడింది. పెండింగ్‌లో ఉన్న క్రమశిక్షణా, క్రిమినల్ కేసుల క్లియరెన్స్, అలాగే సమగ్రత సర్టిఫికెట్ ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. ఎంపికైన అధికారులకు సమాచారం ఇవ్వాలని, ప్రమోషన్ ప్రతిపాదనలు పంపాలని ఆదేశించింది.

అలాగే వివాహ స్థితి వివరాలు, స్టేట్ ఫారెస్ట్ సర్వీస్ నుంచి లియన్ రద్దుకు సమ్మతి, కోర్టు కేసులు లేకపోవడంపై ధృవీకరణలు సమర్పించాలని పేర్కొంది. అధికారులు ప్రస్తుతం సేవలో ఉన్నారని నిర్ధారించాల్సిందిగా సూచించింది. ఏప్రిల్ 16, 2026న ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తంగా ఈ నిర్ణయం తెలంగాణ అటవీ శాఖలో కీలక మార్పులకు దారితీసే అవకాశముంది.

Read More
Next Story