భారత్- ఈయూ ఎఫ్టీఏ: కార్లపై భారీగా తగ్గనున్న సుంకాలు
x
భారత్- ఈయూ ప్రతినిధులు

భారత్- ఈయూ ఎఫ్టీఏ: కార్లపై భారీగా తగ్గనున్న సుంకాలు

110 నుంచి 10 శాతానికి చేరుకోనున్న టారిఫ్ లు


భారత్- యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వల్ల కార్లు సహ ఇతర రవాణా వాహానాలపై సుంకాలు భారీగా తగ్గనున్నాయి. ఈయూ నుంచి ప్రతి సంవత్సరం భారత్ కు దాదాపు 2.50 లక్షల యూనిట్ల కార్లు దిగుమతి అవుతూ ఉంటాయి.

వీటిపై 110 శాతం సుంకాలు విధిస్తున్నారు. తాజా ఒప్పందంలో భాగంగా ఇకపై వీటి నుంచి కేవలం 10 శాతం సుంకాలు మాత్రమే ఉంటాయి. ఈ ప్రయోజనాలు వినియోగదారులకు బదిలీ చేస్తే భారీ ఉపశమనం లభిస్తుంది.

‘‘భారత్ సహ ఇతర వాణిజ్య భాగస్వాములెవరూ పొందని సుంకాల తగ్గింపులను ఈయూ మంజూరు చేస్తుంది. ఉదాహారణకు కార్లపై సుంకాలు క్రమంగా 110 శాతంగా ఉండగా, అవి పదిశాతానికి చేరుకుంటాయి.
ఐదు నుంచి పది సంవత్సరాల వరకూ కారు విడి భాగాలకు పూర్తిగా సుంకాలు ఉండవు. యంత్రాలపై 44 శాతం, రసాయనాలపై 22 శాతం, ఔషధాలపై 11 శాతం వరకూ ఉన్న సుంకాలు రద్దు చేస్తారు’’ అని ఈయూ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ఎప్టీఏ ప్రకారం.. ఈయూ తరుచుగా భారతీయ వ్యవసాయ ఎగుమతులపై విధించే సుంకాలు తొలగించాల్సి ఉంటుంది. ఇవి సగటున 36 శాతంగా ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ రైతులకు తన మార్కెట్ ను స్వేచ్ఛగా తెరుస్తుంది.
ఉదాహారణకు వైన్ లపై భారత్ విధించిన సుంకాలు అమల్లోకి వచ్చిన తరువాత ఇవి 150 శాతం నుంచి 75 శాతానికి తగ్గుతాయి. చివరకు ఇవి 20 శాతం ఉంటుంది. ఆలివ్ నూనెపై సుంకాలు ఐదు సంవత్సరాలలో 45 శాతం నుంచి సున్న శాతానికి తగ్గుతాయి. బ్రెడ్, స్వీట్లు వంటి ప్రాసెస్ చేయబడిన వ్యవసాయ ఉత్పత్తులపై 50 శాతం సుంకాలు తొలగిస్తారు.
బీఫ్, కోడి మాంసం, బియ్యం, చక్కెర వంటి ఉత్పత్తులపై నిబంధనలు సడలించారు. అలాగే యూరోపియన్ యూనియన్ కు సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులు కూడా రక్షించబడతాయని తెలిపారు. అన్ని భారతీయ దిగుమతులు ఈయూ విధించే నియమాలను కూడా గౌరవించాల్సి ఉంటుంది.
ప్రధాని ఏం చెప్పారు..
ఒప్పందం కుదిరిన విషయాన్ని స్వయంగా భారత ప్రధాని మోదీ ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన చివరి రౌండ్ శిఖరాగ్ర సమావేశంలో మోదీ- ఈయూ అధ్యక్షురాలు వాన్ డర్ లేయన్, కలిసి యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాకు ఆతిథ్యం ఇచ్చారు.
ఈ ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్ గా రెండు పక్షాలు అభివర్ణిస్తున్నారు. భారత్ లోని 140 కోట్ల మందికి , కోట్లాది మంది యూరోపియన్లకు ప్రయోజనం చేకూరుస్తుందని ఇండియన్ ఎనర్జీ వీక్ ను వర్చువల్ గా ఉద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు.
‘‘నేను మీకు ఒక పెద్ద అభివృద్ధి గురించి తెలియజేస్తున్నాను. కల్ హీ భారత్ ఔర్ యూరోపియన్ యూనియన్ కే బీచ్ ఏక్ బహుత్ బడా ఒప్పందం హువా ఫై(నిన్న భారత్, యూరోపియన్ యూనియల్ మధ్య చాలా పెద్ద ఒప్పందం కుదిరింది) అని పేర్కొన్నారు.
ఇది ప్రపంచంలో రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య సమన్వయానికి ఒక అద్బుతమైన ఉదాహారణ. ఈ ఒప్పందం ప్రపంచ జీడీపీలో 25 శాతం, ప్రపంచ వాణిజ్యంలో మూడింట ఒక వంతు ప్రాతినిధ్యం వహిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈయూ- భారత్ మధ్య 2007 నుంచి ఎప్టీఏ కోసం చర్చలు జరుగుతున్నాయి. 2013 లో ఇవి అర్థాంతరంగా నిలిపివేశారు. ఈ చర్చలు 2022 జూన్ లో తిరిగి ప్రారంభించారు.
ఈయూ భారత్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈయూతో భారత్ మొత్తం వస్తువుల వ్యాపారం దాదాపు 136 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. ఇందులో 76 బిలియన్ల ఎగుమతులు కాగా 60 బిలియన్ల విలువ గల దిగుమతులు ఉన్నాయి.
Read More
Next Story