
‘భారత్’ హటెస్ట్ ఆఫ్ ది వరల్డ్?
అత్యంత వేడీ నగరాల జాబితాలో దేశంలోని 50 పట్టణాలు
ప్రపంచంలో అత్యంత వేడీ నగరాల జాబితాలో 50 నగరాలు భారత్ నుంచి చోటు దక్కించుకున్నాయి. వాటిలో అత్యధికంగా ఒక్క ఉత్తరప్రదేశ్ నుంచి దాదాపు రెండు డజన్ సిటీలు ఉన్నాయి.
ఈ నగరాల జాబితాలో ఒడిశాలోని బలాంగీర్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ దాదాపు ప్రతిరోజు 45 ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తరువాత స్థానంలో మహారాష్ట్రలోని చంద్రాపూర్ ఉంది. ఇందులో 44 డిగ్రీలు నమోదవుతోంది. ఆ తరువాత ప్రయాగ్ రాజ్ కూడా ఇదే స్థాయిలో ఎండలు మండుతున్నాయి. తరువాత స్థానంలో వారణాసి, బందా, బరేలీ, అయోధ్యలో 42 డిగ్రీలు, 43 డిగ్రీలు చేరుకున్నాయి.
వాయువ్య భారత్ నుంచి వీస్తున్న వడగాలులు హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ వరకూ వ్యాపించాయి. ఈ వారం ప్రారంభంలోనే విదర్భలో 46 డిగ్రీలా ఉష్ణోగ్రత దాటింది.
ఉష్ణ కవచం..
ఇండో- గంగా మైదానం నుంచి నిరంతరాయంగా వీస్తున్న పొడి వాయువ్య గాలులు ఈ వాతావరణానికి కారణం. నిర్మలమైన ఆకాశం, రుతుపవనాల జాప్యం వంటి వాటివి పరిస్థితి ఇంకా ముదరడానికి కారణం అవుతున్నాయి. దీనికి వాతావరణ శాస్త్రవేత్తలు ‘హీట్ డోమ్’ అని పేరు పెట్టారు. వాయువ్య భారతం మొత్తం తీవ్రమైన వడగాలులు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. పలు రాష్ట్రాలలో రెడ్, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
ఆరోగ్యాలు..
కార్మికులు, పిల్లలు, వృద్ధులలో డీహైడ్రేషన్, వడదెబ్బ కేసులు పెరుగుతున్నట్లు అనేక రాష్ట్రాల నివేదికలు చెబుతున్నాయి. మధ్యాహ్నం వేళ ఎండ నేరుగా తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
పశ్చిమ ఒడిశాలోని టిట్లాగఢ్- బలంగీర్ ప్రాంతం చారిత్మాత్మకంగా భారత్ లోని అత్యంత తీవ్రమైన వేడీ ప్రాంతాలలో ఒకటిగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత వేడీ నగరాలైన 50, ఒకే దేశంలో ఉండటం ఉదయం వేళలో దాదాపు ఒకే పరిస్థితి ఉండటం అసాధారణ తీవ్రతను, భౌగోళిక విస్తరణను స్పష్టం చేస్తుంది.
Next Story

