ప్రతిపక్షాలు వేసిన పిటిషన్ సరైనదేనా?
x

ప్రతిపక్షాలు వేసిన పిటిషన్ సరైనదేనా?

విపక్షాలు కోరుతున్న పరిష్కారం లభిస్తుందా?


Click the Play button to hear this message in audio format

లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరో పదిమంది విపక్ష ఇండి కూటమి నాయకులు అక్టోబర్ 12న సర్ వివాదంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా ఓట్లను తొలగిస్తుందని వారు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

ఇది ఒకరోజు ముందు సీజేఐ సూర్యకాంత్ సూచించిన మార్గాన్నే అనుసరించింది. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలను కలవడానికి నిరాకరించారు. వారికి రాసిన లేఖలో దానికి బదులుగా న్యాయపరమైన పరిష్కారం కోరమని ఆయన వారిని కోరారు. ఆ మార్గం ప్రతిపక్షం కోరుకుంటున్నది సాధించగలదా లేదా అనేది అంత కచ్చితంగా చెప్పలేము.

నిన్న వారు దాఖలు చేసిన పిటిషన్ రాహుల్ గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుగా నమోదు అయింది. పిటిషనర్లుగా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సౌగత్ రాయ్, అఖిలేష్ యాదవ్, తేజస్వీ ప్రసాద్ యాదవ్, సంజయ్ రౌత్, ఏంఏ బేబీ, డీ రాజా, మహువా మాఝీ, సుప్రియా సూలే, ఇటి మహ్మద్ బషీర్ లు ఉన్నారు. ప్రతివాదులుగా కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్ బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి ఉన్నారు.

పిటిషన్ లో ఏం ఉంది..

సర్ ప్రక్రియలో ఎన్నికల కమిషనర్ ఒక్కరే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ప్రధాన ఆరోపణ. ఇది సెప్టెంబర్ 23న ‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’ ప్రచురించిన ఒక పరిశోధనపై ఆధారపడి ఉంది. ఈ నివేదిక ప్రకారం.. పది నెలల వ్యవధిలో ఇద్దరు కమిషనర్లు కనీసం 14 సార్లు అభ్యంతరాలను నమోదు చేశారు.
పిటిషన్ సారాంశంలో కమిషన్ సమాధానం కూడా నమోదు చేశారు. ఈ నివేదికలు మొత్తం చిత్రంలో ఒక భాగాన్ని మాత్రమే చూపిస్తున్నాయని, తమ నిర్ణయాలు ఏకగ్రీవంగా ఉన్నాయని కమిషన్ పేర్కొంది. ఈ వాదనలపై తాము ముందుగానే ఎలాంటి అభిప్రాయానికి రావడం లేదని, కేవలం కమిషన్ రికార్డులు మాత్రమే వాటిని పరిష్కరించగలదని పిటిషన్ లో పేర్కొన్నారు.
రాజ్యంగంలోని ఆర్టికల్ 324 దీనికి ఆధారం. ఇది ఎన్నికల పర్యవేక్షణ అధికారం కమిషన్ కు అప్పగిస్తుంది. టీఎన్ శేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రధాన ఎన్నికల కమిషనర్ కు ఇతర కమిషనర్ల కంటే ఎటువంటి ఉన్నత హోదా లేదని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఎన్నికల కమిషనర్ల చట్టం 2023, సెక్షన్ 18 ఆ సూత్రానికి చట్టబద్దమైన రూపాన్ని ఇచ్చింది. ఇది కమిషన్ లో ఏదైన అంశంపై ఏకాభిప్రాయం కుదరకపోతే మెజారిటీ ప్రాతిపదికగా నిర్ణయాలు జరపాలని సూచిస్తోంది.

సర్ ప్రారంభం..

రెండో ఆరోపణ దేశవ్యాప్త సర్ కు సంబంధించింది. ఈ ప్రక్రియపై నిర్ణయం తీసుకున్న ఫైళ్లను కోరుతూ.. జూలై 28, 2025 న దాఖలు చేసిన సమాచార హక్కు దరఖాస్తును సారాంశం ఉదహరిస్తుంది.
కమిషన్ సమాచార అధికారి జూన్ 24, 2025 నాటి ప్రచురిత ఉత్తర్వును మాత్రమే అందించారు. 2025 లో దేశవ్యాప్త సర్ ను ప్రారంభించడానికి కమిషన్ అథారిటి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అప్పట్లో సమాధానం ఇచ్చింది.
ఈ పిటిషన్ జూన్ 24 నాటి ఉత్తర్వుకు, ఏకగ్రీవ ఆమోదం లభించిందని పేర్కొన్న సంవత్సరం సెప్టెంబర్ 26 నాటి పత్రికా ప్రకటనకు కూడా విరుద్దంగా ఉంది. అందువల్ల అలాంటి ఫైల్ ఏదైనా ఉంటే.. ఆ నిర్ణయాన్ని నమోదు చేసిన పూర్తి ఫైల్ ను అందించమని కోరుతోంది.

పునశ్చరణ..

సవరణ జరిగిన విధానం వల్ల మరో మూడు ఫిర్యాదులు తలెత్తుతున్నాయి. కొత్త రిజిస్ట్రేషన్ల కోసం ఉపయోగించే ఆన్ లైన్ ఫారం 6 ను, 1960 ఓటర్ల రిజిస్ట్రేషన్ నిబంధనలను సవరించకుండానే జూలై లో మార్చారు.
కమిషన్ ఈసీఐనెట్, ఈఆర్ఓనెట్ డేటా బేస్ లకు స్వాతంత్య్ర ఆడిట్ జరగలేదని పిటిషన్ లో ఆరోపించారు. సాఫ్ట్ వేర్ లో రోల్ బ్యాక్ సౌకర్యం లేకపోవడం వల్ల అర్హులైన ఓటర్లను ఓటు పొందలేకపోయారని సమాచారం. 1995 నాటి లాల్ బాబు హుస్సేన్ వర్సెస్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ తీర్పు ప్రకారం అవసరమైన నోటీస్, విచారణ లేకుండానే తొలగింపులు జరిగాయని పిటిషన్ లో ఆరోపించారు.
పరిణామపరంగా దేశవ్యాప్తంగా 13 కోట్ల పేర్లు తొలగించారని ఆరోపిస్తూ దాఖలైన ఒక పెండింగ్ పిటిషన్ ఈ సారాంశం ప్రస్తావిస్తుంది. ముసాయిదా దశలో గైర్హాజరుగా, వేరే చోటికి మారినట్లుగా మరణించినట్లుగా లేదా నకిలీగా గుర్తించినట్లు కమిషన్ పేర్కొన్నది. కమిషన్ వివరణ ప్రకారం.. ఈ సంఖ్య తుది తొలగింపులను సూచించదు.

కోర్టును ఏమని కోరుతున్నారు...

ఇవి నాలుగు సమూహాలుగా ఉన్నాయి. వాటిలో మొదటిది సమాచారం మొత్తం బయటకు రావాలని కోరుతోంది. ప్రతి వివాదాస్పద నిర్ణయానికి సంబంధించిన ఫైళ్లు, ఎజెండాలు, మినిట్స్, నోటింగ్స్, అభ్యంతరాలను కమిషన్ రికార్డులలో ఉంచాలి. అలాగే జూన్ 24 , 2025 నాటి నిర్ణయానికి సంబంధించిన డేటా బేస్ యాక్సెస్ లాగ్ లు, ఫైల్ ను కూడా సమర్పించాలి.
రెండో వర్గం పరిశీలన, పరిణామాలను కోరుతోంది. వివాదాస్పద నిర్ణయాలు ఆర్టికల్ 324, సెక్షన్ 18, టీఎస్ శేషన్ కు అనుగుణంగా ఉన్నాయో లేదో కోర్టు పరిశీలించి చట్టబద్దంగా లేకుండా వాటిని రద్దు చేయాలి. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950, సెక్షన్ 32 తో సహ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఆ సెక్షన్ ఓటర్ల జాబితాలను తయారు చేయడంలో అధికారిక విధిని ఉల్లంఘించినందుకు శిక్షిస్తుంది.
మూడో బృందం రక్షణ చర్యలు కోరుతోంది. వాటిలో మొదటిది భవిష్యత్ లో తీసుకునే ప్రతి సర్ నిర్ణయం సెక్షన్ 18 కింద తీసుకోవాలని, దాన్ని మినిట్స్ లో నమోదు చేయాలని ఆదేశించడం. ఆన్ లైన్ ఫారం 6 నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. తొలగించబడిన ఓటర్ల పేర్లను కారణాలతో పాటు బూత్ ల వారిగా ప్రకటించాలి. అర్హులైన ఓటర్లను పునరుద్ధరించడానికి ఒక క్రియాశీల యంత్రాంగం ఉండాలి. నోటీసు, విచారణ లేకుండా ఏ ఓటర్ ను తొలగించకూడదు.
నాలుగో వర్గం సంస్థాగతమైనది. ఇది విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో, సాంకేతిక నిఫుణుల సాయంతో ఒక కమిటీని కోరుతోంది. ఈ కమిటీ తొలగింపులను, డేటా బేస్ లను ఆడిట్ చేస్తుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ప్రోటో కాల్ లను సాంకేతిక రూపకల్పనను సమీక్షిస్తుంది. మధ్యంతర ఉపశమనంగా, అన్ని రాష్ట్రాలలో ఎస్ఐఆర్ ను నిలిపివేయాలని పిటిషన్ లో కోరుతున్నారు.
పిటిషనర్ లో పేర్కొనని విషయం కూడా అంతే గుణపాఠం నేర్పుతుంది. అక్టోబర్ 9న కూటమి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇచ్చిన మెమోరాండంలో నాలుగు డిమాండ్లు ఉన్నాయి. అవి.. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా, ఎస్ఐఆర్ ను రద్దు చేయడం, కాగితపు బ్యాలెట్లకు తిరిగి రావడం, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రద్దు చేయడం. ఈ డిమాండ్లలో ఏవీ కనిపించనప్పటికీ మధ్యంతర అభ్యర్థన మాత్రం పున: సమీక్షను నిలిపివేయాలని కోరుతోంది.

సంశయవాదులు...

మొదటి ఇబ్బంది కోర్టు సొంత తీర్పే. మే 27న అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసులో సీజేఐ నేతృత్వంలో ధర్మాసనం ఎస్ఐఆర్ ను సమర్థించింది. ఈ పిటిషన్ దీనిని అంగీకరిస్తూ ఎస్ఐఆర్ చెల్లుబాటుకు సంబంధించిన ప్రశ్నను యథాతథంగా తిరిగి చెల్లించాలని తాము కోరడం లేదని పేర్కొంది. కోర్టు గుర్తించిన రక్షణ చర్యలను పాటించారా లేదా అన్నదే తమ ఆందోళన అని అది తెలిపింది.
ప్రతి రాష్ట్రంలోనూ ఎస్ఐఆర్ ను సస్పెండ్ చేయాలన్న మధ్యంతర అభ్యర్థనతో ఆ నిరాకరణ ప్రకటన సొంతన లేకుండా ఉంది. ఈ ప్రక్రియ చెల్లుబాటులో ఉందని నిర్ధారించిన ధర్మాసనం.. అది నిర్వహించిన తీర్పుపై వచ్చిన ఆరోపణల కారణంగా దానిని నిలిపివేయడానికి నిరాకరించవచ్చు. అక్టోబర్ 5న సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఒక సంబంధిత కేసులో ప్రధాన ఎన్నికల కమిషనర్ ను సస్పెండ్ చేయడాన్ని నిరాకరించింది. ‘‘ఎన్నికలను ఎవరూ నిర్వహిస్తారు’’ అని అది ప్రశ్నించింది.
రెండో ఇబ్బంది అతి వ్యాప్తి.. ఎందుకంటే అక్టోబర్ 5 నే అదే వార్తా పత్రిక దర్యాప్తు ఆధారంగా దాఖలైన రెండు మునుపటి పిటిషన్లలో కోర్టు నోటీస్ జారీ చేసింది. ఇక్కడ చట్టం ఉల్లంఘించినట్లు కనిపిస్తే దాన్ని రద్దు చేస్తామని సీజేఐ ప్రకటించారు.
మూడో ఇబ్బంది ఏంటంటే.. అక్టోబర్ 12న తుది ఓటర్ల జాబితా వెలువడాల్సి ఉన్న పంజాబ్ విషయంలో అత్యవసర పరిస్థితిని పిటిషన్ లో పేర్కొనడం ద్వారా విషయం స్పష్టమవుతుంది. అదే రోజు ఆ జాబితా ప్రచురించబడింది. అందులో 2.01 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇది సవరణకు ముందున్న 13.60 లక్షల కంటే తక్కువ. అందువల్ల పిటిషన్ దాఖలు చేసే రోజే అత్యవసర పరిస్థితి అనే కారణం చెల్లుబాటు కాకుండా పోయింది.
దీనికి అత్యంత సమీప ఉదాహారణ బీహార్ లోనే ఉంది. ఎందుకంటే అక్కడ 2025 జూలై లోనే ఈ సవాల్ చేయగా, కేసు పెండింగ్ లో ఉండగానే నవంబర్ లో ఎన్నికలు జరిగాయి. ఇది జరిగిన ఆరు నెలలకు తీర్పు వెలువడింది. ఇప్పుడు కోరుతున్నటువంటి రాష్ట్రాలవ్యాప్తంగా ఉన్న డేటా బేస్ ల ఆడిట్ తో కూడిన ఒక కమిటీకి కూడా ఇంత సమయం పట్టవచ్చు.
నాల్గవ ఇబ్బంది ఓటింగ్ యంత్రాలకు సంబంధించింది. దీనిపై కోర్టు ఏప్రిల్ 2024 లో తీర్పు ఇచ్చింది. అప్పుడు అది కాగితపు బ్యాలెట్ లకు తిరిగి వెళ్లాలన్న, పేపర్ ట్రైల్ స్లిప్ లను పూర్తిగా ధృవీకరించాలన్న అభ్యర్థనలను తిరస్కరించింది. కోర్టు నియమించిన కమిటీ ద్వారా యంత్రాల నియమాలను కొత్తగా సమీక్షించాలంటే, కోర్టు తాను పరిష్కరించబడినవిగా భావించి అంశాలను పున: పరిశీలించవలసి ఉంటుంది.

వీధి.. న్యాయస్థానం..

ఈ సందేహాలు, విచారణ జరిపేందుకు ఇంకా కొన్ని వేదికలు ఉండాలనే అవసరాన్ని సూచిస్తున్నాయి. సుదీర్ఘ తీర్పులో కమిషన్ అధికారాలను సమర్థించిన న్యాయస్థానం. ఓటు హక్కు కోల్పోవడాన్ని సరిదిద్దడానికి సరైన స్థితిలో లేదు. ఈ వాదన ప్రకారం.. సర్ ను ఆపమని కమిషన్ పై ఒత్తిడి తీసుకు రావడానికి నిరంతర, శాంతియుత నిరసనే ముఖ్యమార్గం.
కోర్టు కమిషన్ ఫైళ్లు, మినిట్స్ తెప్పించుకుంటే వివాదాస్పద నిర్ణయాలు సామూహికమైనవో కాదో రికార్డులో తెలుస్తోంది. ఒకవేళ అవి సామూహికమైనవి కాకపోతే.. ఏమి జరుగుతుందో ధర్మాసనం ఇప్పటికే చెప్పింది. అటువంటి నిర్ణయాలు కమిషన్ అధికార పరిధికి మించినవి. కాబట్టి కోర్టు వాటిని నిలిపివేస్తుందని జస్టిస్ జయ్ మాల్చా బాగ్చి అక్టోబర్ 5న వ్యాఖ్యానించారు.
ఈ కేసు తక్షణ చట్టపరమైన ప్రాముఖ్యత, ధృవీకరించదగిన రికార్డులను కోరడంలో ఉంది.కమిషన్ తన నిర్ణయాలు సమిష్ఠిగా తీసుకున్నవని, దాని రక్షణ చర్యలు సమర్థవంతంగా ఉన్నాయని నిరూపించగలదు. కానీ ఆ రికార్డులు సరిదిద్దాల్సిన వ్యత్యాసాలను బయటపెట్టవచ్చు. ఏదైన న్యాయపరమైన ఉల్లంఘనను నిరూపించడానికి, భారత్ అంతటా పునర్విమర్శను నిలిపివేయడానికి కారణాలను ఏర్పడరచడానికి మధ్య ఉన్న తేడాపై ఆధారపడి ఉంది.
Read More
Next Story