
హీరో విజయ్
‘జన నాయగన్’ విడుదల కష్టాలు
డివిజన్ బెంచ్ నుంచి మరోసారి సింగల్ బెంచ్ కు చేరిన వివాదం
టీవీకే అధినేత, దళపతి విజయ్ నటించిన ‘జననాయగన్’(Jana Nayagan) సినిమాకు కష్టాలు కొనసాగుతున్నాయి. ఆయన నటించిన చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఇవ్వడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే.
ఈ వివాదం పై చిత్ర నిర్మాతలు మొదట హైకోర్టును తరువాత సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ వారికి ఉపశమనం కలిగించలేదు. తాజాగా కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ కేసును తిరిగి సింగల్ బెంచ్ కు అప్పగించింది.
అంతకుముందు సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించిన సింగల్ బెంచ్ సర్టిఫికెట్ ను డివిజన్ బెంచ్ పక్కకు పెట్టింది. బోర్డు కౌంటర్ ఇవ్వడానికి తగిన సమయం ఇవ్వాలని తీర్పునిచ్చింది. సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కు వెళ్లిన కేసుపై హైకోర్టు జనవరి 20 కి తీర్పును రిజర్వ్ చేసింది.
రెండు వైపుల వాదనలు విన్న తరువాత ప్రధాన న్యాయమూర్తి ఎంఎం శ్రీవాస్తవ, జస్టిస్ జి. అరుళ్ మురుగన్ లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు రిజర్వ్ చేసింది. జనవరి 9 న చిత్ర నిర్మాత కేవీఎన్ ప్రొడక్షన్ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ పీటీ ఆశా జారీ చేసిన ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. న్యాయమూర్తి జారీ చేసిన ఆదేశంలో వెంటనే సెన్సార్ సర్టిఫికెట్ మంజూరు చేయాలంది.
జనవరి 15న సుప్రీంకోర్టు మద్రాస్ హైకోర్టు ఈ పిటిషన్ పై జనవరి 20న నిర్ణయం తీసుకోవాలని కోరిన తరువాత ఈ అప్పీల్ ను విచారించింది. ‘జన నాయగన్’ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని సింగల్ జడ్జీ ఆదేశాన్ని నిలిపివేస్తూ మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వూలు సవాల్ చేస్తూ ‘జన నాయగన్’ నిర్మాత దాఖలు చేసిన పిటిషన్ స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. తగిన ఉపశమనం కోసం హైకోర్టునే ఆశ్రయించాలని సూచించింది.
జనవరి 20 న కేసు విచారణకు వచ్చినప్పుడూ సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ తరఫున అదనపు సోలిసిటర్ జనరల్ ఏఆర్ఎల్ సుందరేషన్, సెన్సార్ సర్టిఫికెట్ మంజూరు చేయాలని సిఫార్సు చేస్తూ పరీక్షా కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ జనవరి 5న సెన్సార్ బోర్డు చైర్ పర్సన్ ఉత్తర్వూ జారీ చేశారని తెలిపారు.
ఆయన చెప్పిన దాని ప్రకారం.. సినిమాను వీక్షించిన పరీక్షా కమిటీ సభ్యుడి ఫిర్యాదు ఆధారంగా ఈ విషయాన్ని రివైజింగ్ కమిటీని నివేదించారు. జనవరి 5 నాటి ఉత్తర్వూను పిటిషనర్ సవాల్ చేయలేదని ఆయన తెలిపారు. ఈ చిత్రంలో పూజా హెగ్దే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, నరైన్ కీలక పాత్రల్లో నటించారు. కెవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇదే బ్యానర్ లో ప్రస్తుతం టాక్సిక్ లో విడుదల అవుతోంది.
Next Story


