విద్య వ్యాపారం కాదని రేవంత్ గుర్తించాలి: కవిత
x

విద్య వ్యాపారం కాదని రేవంత్ గుర్తించాలి: కవిత

తెలుగు మెటా వివరణ: ఫీజుల నియంత్రణ కోసం చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ, విద్యపై ప్రభుత్వ బాధ్యతను కవిత గుర్తు చేశారు.


తెలంగాణలో విద్య అనేది వ్యాపారంగా మారిపోయింతంటూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిని విద్యావాఖ మంత్రి రేవంత్ రెడ్డి పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. ఫీజులను విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా పెంచుకున్నా సదరు శాఖ మంత్రి నోరు విప్పకపోవడం దీనికి నిదర్శనమన్నారు. నాణ్యమైన విద్య, ఫీజుల నియంత్రణ అంశంపై రౌండ్ టేబుల్ సమావేవం నిర్వహించారు. ఈ సందర్బంగానే రాష్ట్రంలో 50 నుంచి 120 శాతం వరకు ఫీజులు పెరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రిగా ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

మే నెలలోనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. ఉచిత విద్య, వైద్యం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని తెలిపారు. పిల్లల చదువు కేవలం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదని, ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కువ మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లలోనే చదువుతున్నారని చెప్పారు. తల్లిదండ్రుల ఆశలను వ్యాపారంగా మార్చుతున్నారని విమర్శించారు. విద్యాసంస్థలు వ్యాపార ధోరణిలో నడుస్తున్నాయని, వాటిలో చాలా వరకు రాజకీయ నాయకులవేనని అన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఈ ఏడాది 120 శాతం ఫీజులు పెంచిన విషయాన్ని ప్రస్తావించారు.

ప్రభుత్వ స్థలంలో ఉన్న స్కూల్‌లోనే ఇలా పెంపు జరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అలాగే ఆ స్కూల్ భూములపై, నిర్వహణపై కూడా అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. విరాళాలు వచ్చినా వాటిపై సరైన లెక్కలు లేవని అన్నారు. గతంలో ఫీజుల నియంత్రణ కోసం కమిషన్ ఏర్పాటు చేసి నివేదిక ఇచ్చినా, అమలు జరగలేదని గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో వేల కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పారు. దీనివల్ల కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చిందని వివరించారు.

కొత్తగా తీసుకువచ్చిన జీవో వల్ల తల్లిదండ్రులపై మరింత భారం పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఫీజుల దోపిడీని నియంత్రించడానికి తక్షణ చర్యలు అవసరమని చెప్పారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా ఫీజుల నియంత్రణ కోసం శాశ్వత వ్యవస్థ తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలో విద్య, వైద్యం అంశాల్లో సరైన విధానాలు అవసరమని పేర్కొన్నారు. ప్రజలకు ఉపశమనం కలిగించే నిర్ణయాలు తీసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు.

Read More
Next Story