డిజిటల్ సభ్యత్వంపై బీఆర్ఎస్ ఫోకస్.. కేసీఆర్ కీలక నిర్ణయాలు
x

డిజిటల్ సభ్యత్వంపై బీఆర్ఎస్ ఫోకస్.. కేసీఆర్ కీలక నిర్ణయాలు

డిజిటల్ సభ్యత్వ నమోదు, బూత్ స్థాయి శిక్షణలు, జిల్లా ఇంచార్జీల నియామకంపై కీలక నిర్ణయాలు.


బీఆర్ఎస్ పార్టీని డిజిటల్ దిశగా తీసుకెళ్లే కీలక నిర్ణయాలు మంగళవారం తీసుకున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రధాన కార్యదర్శుల సమావేశంలో సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించారు. దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చ జరిగింది.

ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియ, ఓటరు జాబితా సవరణలు డిజిటల్ విధానంలో జరుగుతున్న నేపథ్యంలో.. పార్టీ సభ్యత్వ నమోదు కూడా అదే తరహాలో ఉండాలని సమావేశం అభిప్రాయపడింది. దీనికోసం ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ నుంచి ప్రత్యేక సభ్యత్వ సమన్వయకర్తలను నియమించాలని నిర్ణయించారు.

అలాగే మండలాలు, మున్సిపల్ బాడీల స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించేందుకు ప్రత్యేక సమన్వయ కమిటీలను రెండు మూడు రోజుల్లో ఏర్పాటు చేయనున్నారు.

రాష్ట్రంలోని 35,655 పోలింగ్ బూత్‌లలో డిజిటల్ సభ్యత్వ నమోదు చేపట్టేందుకు బూత్‌కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మందికి శిక్షణ ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది. ఈ శిక్షణలో డిజిటల్ మెంబర్‌షిప్ విధానం, నిర్వహణపై పూర్తి అవగాహన కల్పించనున్నారు.

సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శుల పర్యవేక్షణలో కొనసాగించాలని కూడా నిర్ణయించారు. ఈ క్రమంలో వివిధ జిల్లాలకు ప్రత్యేక ఇంచార్జీలను నియమించారు.

ఇన్‌ఛార్జీల వివరాలివే..

  • ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు - తక్కళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి.
  • జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలు – జీవన్ రెడ్డి, మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి.
  • ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలు – మతి సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి.
  • జనగాం, హనుమకొండ, వరంగల్ జిల్లాలు - పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే, ప్రధాన కార్యదర్శి.
  • మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలు - గ్యాదరి బాలమల్లు, ప్రధాన కార్యదర్శి.
  • నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు - గంగాధర్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి.
  • మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలు - నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి.
  • ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు - రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి.
  • వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలు - మతి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే.
  • మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలు — మహమూద్ అలీ, మాజీ మంత్రి.
  • గద్వాల్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలు — మెట్టు నివాస్, కార్యదర్శి.
  • మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి జిల్లాలు — పోచంపల్లి నివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్.
  • హైదరాబాద్ జిల్లా — తలసాని నివాస్ యాదవ్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే.
  • నల్గొండ, సూర్యాపేట జిల్లాలు — ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి.
Read More
Next Story