టెలిఫోన్ ట్యాపింగ్ పై సిట్ కు కీలక ఆధారాలు
x
Telephone tapping

టెలిఫోన్ ట్యాపింగ్ పై సిట్ కు కీలక ఆధారాలు

కాగితంపై చేతిరాతతో రాసిన కొన్ని మొబైల్ ఫోన్ నెంబర్ల జాబితా అప్పటి డీసీపీ రాధాకిషన్ రావుకు అందింది


బీఆర్ఎస్ హయాంలో జరిగిన టెలిఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కు తాజాగా కీలక ఆధారం దొరికినట్లు సమాచారం. అప్పటి ముఖ్యమంత్రి ఇంటినుండి చేతిరాతతో కాగితంపై రాసిన కొన్ని ఫోన్ నెంబర్లు జాబితా వివరాలు సిట్(SIT) అధికారులకు దొరికినట్లు తెలిసింది. కాగితంపై చేతిరాతతో రాసిన కొన్ని మొబైల్ ఫోన్ నెంబర్ల జాబితా అప్పటి డీసీపీ రాధాకిషన్ రావుకు అందింది. ఆ లిస్టును స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్న డీఎస్పీ ప్రణీత్ రావు కు రాధాకిషన్ పంపారు. ఈ విషయాన్ని స్వయంగా రాధాకిషనే సిట్ విచారణలో బయటపెట్టారని సమాచారం.

అయితే ఇక్కడ తెలియాల్సిన విషయం ఏమిటంటే రాధాకిషన్ కు అప్పటి ముఖ్యమంత్రి ఇంటినుండి జాబితా పంపింది ఎవరు ? చేతిరాతతో రాసిన నెంబర్ల కాగితం ఇపుడు సిట్ అధికారుల దగ్గరే ఉంది. సిట్ అధికారులు కొందరిని అనుమానిస్తున్నారు. కేసీఆర్ స్వయంగా నెంబర్లు రాసుండచ్చు లేదా కేటీఆర్, కవిత, హరీష్, సంతోష్ రావు, కేసీఆర్ దగ్గర ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖరరెడ్డి లేదా ఇంకెవరైనా కూడా రాసి పంపి ఉండచ్చు. కాగితం మీద ఉన్న చేతిరాత ఎవరిది అనే విషయాన్ని నిగ్గుతేల్చే పనిలో సిట్ అధికారులున్నారు. రాధాకిషన్ కు సదరు కాగితాన్ని ఎవరు తెచ్చి ఇచ్చారనే విషయం సిట్ అధికారులకు తెలుసు. అందుకనే చేతిరాత ఎవరిదో తేల్చేందుకు సిట్ అధికారులు రాజ్యసభ మాజీ ఎంపీ సంతోష్ రావుతో విచారణ మొదలుపెట్టాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

సంతోష్ రావుతో మొదలవ్వబోయే విచారణ కేసీఆర్ కుటుంబసభ్యులు కేటీఆర్, కవిత, హరీష్ దాకా చేరుకోవచ్చు. అవసరమైతే కేసీఆర్ ను కూడా విచారించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఇంటిలో కూర్చుని అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ టీ ప్రభాకరరావు కూడా కాగితంపై కొన్ని నెంబర్లు రాసి పంపించే అవకాశాలున్నాయి. ఏదేమైనా తొందరలోనే కేసీఆర్ ఇంట్లో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలవిచారణ మొదలవ్వబోతున్నట్లు అయితే అర్ధమవుతోంది. ఆ విచారణలో కాగితంలోని చేతిరాత ఎవరిదో తేలితే ట్యాపింగ్ విచారణ ఒక కొలిక్కి వస్తుందనే ఆశాభావంతో సిట్ అధికారులు ఉన్నారు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Read More
Next Story