
కొండా సురేఖకు షాక్.. కేబినెట్ నుంచి ఔట్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బర్తరఫ్ లేఖను గవర్నర్‌కు పంపినట్లు సీఎంవో తెలిపింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఆమె బర్తరఫ్ లేఖను గవర్నర్‌కు పంపినట్లు సీఎంవో వెల్లడించింది. తన బర్తరఫ్ అంశంపై స్పందించిన కొండా సురేఖ.. ఎలాంటి సంతకం లేకుండా లేఖ రిలీజ్ చేశారన్నారు. ‘‘నేను ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కుటుంబ సభ్యులు మాట్లాడిన దానికి ఏం సంబంధం? పదేళ్లుగా నా కూతురు టికెట్ కోసం ప్రయత్నం చేస్తుంది. కడియం తన కూతురిని ఎంపీ చేసుకోలేదా? DS ఇంట్లో రెండు పార్టీలు లేవా? నేను ఎలాంటి అవినీతి చేయలేదు..కనీసం నాతో మాట్లాడాల్సింది’’ అని పేర్కొన్నారు.
కొంతకాలంగా కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. ఆమె కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరింది. సురేఖపై చర్యలు తీసుకోవాలని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కూడా నివేదిక ఇచ్చింది.
సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని సిఫారసు చేసింది. దీంతో సురేఖ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. ఆమెను రాజీనామా చేయాలని అధిష్ఠానం కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే సురేఖ మాత్రం మంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్న వైఖరి తీసుకున్నట్లు తాజా నివేదికలు పేర్కొన్నాయి. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో సురేఖ సమావేశమయ్యారు. తన వైపు జరిగిన పరిణామాలను వారికి వివరించారు.
అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. అయితే గురువారం పరిస్థితి మారింది. సురేఖను కేబినెట్ నుంచి తొలగిస్తున్నట్లు సీఎంవో లేఖ విడుదల చేసింది. ఆ లేఖను గవర్నర్‌కు పంపినట్లు తెలిపింది. ఇక లోక్‌భవన్ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఇదే సమయంలో తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా జి. చిన్నారెడ్డి నియామకాన్ని కూడా ప్రభుత్వం రద్దు చేసింది.
ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని నియమించింది. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నెరెళ్ల శారదను నియమించింది. కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి నియామకానికి ఆమోదం తెలిపింది. కొండా సురేఖ వ్యవహారంలో కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తాజా నిర్ణయంతో తెరపడినట్లయింది. ఇక ఈ పరిణామం తెలంగాణ కాంగ్రెస్‌లో ఎలాంటి ప్రభావం చూపుతుందనేది చూడాల్సి ఉంది.

