మంగ్లీకి అవకాశాలివ్వకండి.. ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు ఫిర్యాదు..
x

మంగ్లీకి అవకాశాలివ్వకండి.. ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు ఫిర్యాదు..

తనకు పాటలు పాటడం తప్ప మోసాలు చేయడం రాద్దన్న మంగ్లీ. బాధుతులకు అండగా ఉంటానంటూ హామీ.


సింగర్ మంగ్లీపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు టాలీవుడ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒక ఫిర్యాదు అందింది. ఆమె సినిమాలు, ఈవెంట్స్‌కు కూడా అనుమతులు ఇవ్వొద్దని కోరారు. మైక్రో ఫైనాన్స్ పేరుతో జరిగిన దాదాపు రూ.150-200 కోట్ల మోసం కేసులో మంగ్లీ పేరు వినిపించడమే ఇందుకు కారణం. అమాయక ప్రజలను పెట్టుబడుల పేరుతో మోసం చేసిన స్కాం కేసులో మంగ్లీని కూడా నిందితుల జాబితాలో చేర్చారు పోలీసులు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది. కాగా ఈ కేసులో పోలీసుల విచారణ ముగిసే వరకు ఆమెకు ఎటువంటి అవకాశాలు ఇవ్వొద్దని MAA సభ్యులు తమ ఫిర్యాదులో కోరారు.

నిజానిజాలు తెలియకుండా అవకాశాలు ఇస్తే.. ఇలాంటి వారికి పరిశ్రమ అండగా నిలుస్తుందన్న తప్పుడు అభిప్రాయం ప్రజల్లో కలిగే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడినట్లు సమాచారం. అందులో భాగంగానే ఈ కేసులో వాస్తవాలు బయటకు వచ్చే వరకు, పోలీసుల దర్యాప్తు పూర్తయ్యే వరకు సింగర్ మంగ్లీకి ఎటువంటి అవకాశాలు, అనుమతులు ఇవ్వొద్దని MAA సభ్యులు తమ ఫిర్యాదులో కోరారు.

అయితే తనపై వస్తున్న ఆరోపణలను సింగర్ మంగ్లీ ఖండించారు. తనకు పాటలు పాడటం తప్ప స్కామ్‌లు చేయడం చేతకాదని అన్నారు. తాను నిజంగా తప్పు చేసి ఉంటే ఎలాంటి శిక్షకు అయినా సిద్ధమని అన్నారు. తాను కూడా పేద కుటుంబం నుంచే వచ్చానని, డబ్బు విలువ తనకు బాగా తెలుసని అన్నారు. అలాంటిది తాను పేదలను, అమాయకులను ఎందుకు మోసం చేస్తానని ప్రశ్నించారు. నెల రోజులుగా ప్రోగ్రామ్స్, రికార్డింగ్ అన్నింటిని వదులుకున్నాని, బాధితులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Read More
Next Story