మరో మావోయిస్ట్ కీలక నేత లొంగుబాటు
x

మరో మావోయిస్ట్ కీలక నేత లొంగుబాటు


మావోయిస్ట్ పార్టీలో కీలకంగా మెలిగిన నేత, కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ మంగళవారం ఉదయం పోలీసుల ముందు లొంగుపోయారు. ఝార్ఖండ్‌లోని సరండా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సంతోష్ తన భార్యతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన నరహరి దాదాపు 45 సంవత్సరాలుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆయన ఆయుధం వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు వచ్చారు.

డిగ్రీ చదువతున్న సమయంలోనే హరి.. ఉద్యమం వైపు అడుగులు వేశారు. మావోయిస్టుల భావజాలానికి ఆకర్షితిడైన ఆయన అప్పటి మావోయిస్ట్ రాష్ట్ర కార్యదర్శి పులి అంజయ్య, క్రాంతిరణదేవ్ సహాయంతో ఉద్యమంలో కలిశారు. ఆ తర్వాత కొంతకాలానికి అడవిబాట పట్టారు. అనేక కీలక ఆపరేషన్స్‌లో భాగమై మావోయిస్ట్ అగ్రనేతగా ఎదిగారు. ఝార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగంలో హరి కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇదిలా ఉంటే భద్రతా బలగాలు ఇంకా మావోయిస్ట్ పార్టీ కీలక నేతలు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మిసిర్ బెస్ర కోసం గాలింపులు కొనసాగిస్తున్నారు.


Read More
Next Story