దావోస్ లో మెగాస్టార్ చిరంజీవి సర్ ప్రైజ్
x
Revanth and Megastar Chiranjeevi in Davos

దావోస్ లో మెగాస్టార్ చిరంజీవి సర్ ప్రైజ్

బుధవారం రాత్రి జరిగిన సమావేశాల్లో అందరినీ ఆశ్చర్యపరుస్తు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యక్షమయ్యారు


దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యక్షమయ్యారు. పెట్టుబడుల ఆకర్షణ సమావేశాల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో పాటు చిరంజీవి కూడా పాల్గొనటం అందరినీ సర్ ప్రైజ్ కు గురిచేసింది. మంత్రులు, ఉన్నతాధికారుల 15 మంది సభ్యులతో రేవంత్ స్విట్జర్లాండ్ లోని దావోస్ సదస్సులో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం రాత్రి జరిగిన సమావేశాల్లో అందరినీ ఆశ్చర్యపరుస్తు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యక్షమయ్యారు. చిరంజీవి దావోస్ సమావేశానికి హాజరవబోతున్నట్లు చాలామందికి తెలీదు.

రేవంత్ ప్రత్యేక ఆహ్వానం మేరకే చిరంజీవి దావోస్ కు చేరుకున్నట్లు ప్రభుత్వవర్గాలు చెప్పాయి. ప్రముఖ సినీనటుడిగా చిరంజీవికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో చిరంజీవి అవార్డులను కూడా అందుకున్నారు. చిరంజీవికి గ్లోబల్ గా ఉన్న గుర్తింపును దృష్టిలో పెట్టుకునే రేవంత్ ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మనశంకర వరప్రసాద్ సినిమా హిట్ అయిన నేపధ్యంలో చిరంజీవి తన కుటుంబసభ్యులతో స్విట్జర్లాండ్ లోనే ఉన్నారు. ఈ విషయం తెలుసుకాబట్టే దావోస్ ప్రపంచ ఆర్ధిక సదస్సులో నుండే రేవంత్ ఫోన్ లో మాట్లాడారు. వెంటనే చిరంజీవి కూడా సరే అని చెప్పి దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సమావేశాలు జరుగుతున్న వేదికకు చేరుకుని సమావేశాల్లో పాల్గొన్నారు. వివిధ దేశాల్లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలతో రేవంత్ పాల్గొన్న సమావేశాల్లో చిరంజీవి కూడా భాగస్వామి అవ్వటం మెగాస్టార్ అభిమానులకు సంతోషంగా ఉంది.


ప్రపంచంలో ఎంతో పాపులరైన సౌందర్య సాధనాల ఉత్పత్తి సంస్ధ లోరియల్ తన మొదటి బ్యూటీ టెక్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించింది. గూగుల్, సేల్ప్ ఫోర్స్, యూనీలివర్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా తెలంగాణలో పెట్టుబడులకు ఆశక్తి చూపుతున్నాయి.

Read More
Next Story