దురంధర్, ఓజీలను ప్రస్తావించిన మోదీ
x
ప్రధాని నరేంద్ర మోదీ

దురంధర్, ఓజీలను ప్రస్తావించిన మోదీ

2013 నాటి పరిస్థితికి, ఇప్పటికి తేడా చూడండని యువతకు విజ్ఞప్తి


Click the Play button to hear this message in audio format

భారత్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, దాన్ని కొన్ని పక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీ యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న శ్రీరామ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ధి వేడుకలకు ఆయన శనివారం రాత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఓజీ(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్), దురంధర్ వంటి సినిమా డైలాగును ప్రస్తావిస్తూ విద్యార్థులతో మమేకం అయ్యేందుకు ప్రధాని ప్రయత్నించారు.

తాను 2013 లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీరామ కాలేజ్ కు వచ్చానని గుర్తు చేసుకున్నారు. అప్పుడు తాను చేసిన ప్రసంగాన్ని ప్రస్తావించిన మోదీ, భారత్ సాధించిన అభివృద్ధిని వివరించారు. ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఈ త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి సాధించిందని పేర్కొన్నారు.
దుర్యాగంజ్ లో ఒక నిరాడంబరమైన సంస్థగా ప్రారంభమైన ఈ కాలేజ్, తరువాత కాలంలో ఉన్నతమైన సంస్థగా మారి వందలాది మందిని తీర్చిదిద్దిందని చెప్పారు. పూర్వ విద్యార్థులు ఈ కాలేజీకి చెందిన వారమని చెప్పుకోవడం గర్వకారణంగా మారిందని అన్నారు.
2013 లో దేశంలో అవినీతి రాజ్యమేలుతుందని, ఉగ్రవాద దాడులతో దేశం అల్లాడుతోందని, ద్రవ్యోల్బణం, కుటుంబ రాజకీయాలు, నక్సలిజం, కుంభకోణాలు పరిపాటిగా మారాయని, కానీ తాము అధికారంలోకి వచ్చిన ఈ 12 సంవత్సరాలలో దేశం అన్నింటిని అధిగమించి, వృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పుకొచ్చారు.
పాకిస్తాన్ కు దాని గడ్డమీదే బుద్ధి చెప్పామని, నక్సలిజం వెన్నువిరిచామని వివరించారు. 2013 లో శ్రీరామ కాలేజీలో తాను చేసిన సగం గ్లాస్ ఉదాహారణను మరోసారి ప్రస్తావించారు. ‘‘గ్లాసు సగం నీటితో ఉన్నప్పుడు కొంతమంది దీనిని సగం గ్లాసు అని, మరికొంతమంది సగం గాలితో ఉందని చెప్తారని, కానీ తాను మాత్రం సగం నీళ్లు, సగం గాలితో పూర్తిగా నిండి ఉంది’’ అని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. అయితే తన ఆశావాదాన్ని కొంతమంది ఎగతాళి చేశారని, కానీ ఇప్పుడు వారి అభివృద్ధి కళ్లముందు కనపడుతోందని పేర్కొన్నారు
Read More
Next Story