
భారత్ కు మూడు లక్ష్యాలు నిర్దేశించిన మోదీ
ప్రజా సేవలో 25 ఏళ్లు పూర్తయిన వేళ కీలక ప్రసంగం
ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తయిన సందర్బంగా భారత్ ముందు మూడు కీలక లక్ష్యాలను ప్రధాని మోదీ నిర్దేశించారు. వాటిలో ఒకటి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం, ఒలింపిక్స్ ఆతిథ్యం ఇవ్వడం, భారతీయులను అంతరిక్షంలోకి పంపడం వంటివి కీలకమైనవని పేర్కొన్నారు.
ఏదైన ‘మనం సాధిస్తాం’ అనే కొత్త నినాదంతో లక్ష్యాలను చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ, ఇండోర్ స్టేడియానికి వచ్చిన తన అభిమానులకు ఈ మేరకు స్పష్టం చేశారు.
ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాలు..
మోదీ తొలిసారిగా ప్రభుత్వ బాధ్యతలు చేపట్టి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. ఆయన 2001 అక్టోబర్ 7 న కేశుభాయ్ పటేల్ తరువాత గుజరాత్ 14వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
‘‘ఈ రోజు నా ప్రయాణంలో ఈ దశలో నేను ప్రతివాలంటీర్ కు, ప్రతి సహోద్యోగికి గౌరవపూర్వకంగా వందనం చేస్తున్నాను. మిత్రులారా ఈ రోజు కేవలం జ్ఞాపకాలకు సంబంధించిన రోజు కాదు. ఇది మన సంకల్పాన్ని వ్యక్తపరిచే రోజు ఇది. మనం సాధిస్తాం.. మనం సాధిస్తాం.. మనం సాధిస్తాం’’ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.
వికసిత్ భారత్ లక్ష్యాలు..
వికసిత్ భారత్ పై తన దార్శనికతను వెల్లడించిన తరువాత మూడు లక్ష్యాలతోపాటు ఇతర లక్ష్యాలను కూడా నిర్దేశించారు. వాటిలో 2047 నాటికి భారత్ ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడం, స్వయం సమృద్ది సాధించడం, దేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చడం వంటివి ఉన్నాయి. భారత్ ఒలింపిక్స్ ఆతిథ్యం ఇవ్వడం, భారతీయులను సురక్షితంగా అంతరిక్షంలోకి పంపడం పై కూడా సవివరంగా మాట్లాడారు.
నేపథ్యం..
ప్రభుత్వం నిరసనలు, ప్రతిపక్షాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న తరుణంలో ఈ ప్రసంగం చేశారు. జూలైలో జరిగిన నిరసనల కారణంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఓటర్ల సమగ్ర జాబితా పై ఏకాభిప్రాయం లేకుండా జరుగుతున్నాయని, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ నిరసనలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, బీజేపీతో సీజేపీ కుమ్మక్కు అయిందని కాంగ్రెస్, సీజేపీ ఆరోపిస్తున్నాయి.
అయితే ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ‘సర్’ లో అక్రమం జరిగితే కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్, పంజాబ్, జమ్మూకశ్మీర్ లో విపక్షాలు ఎలా గెలిచాయని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలలో అనేక రాష్ట్రాలు స్థానిక పార్టీల మద్దతుతో ఎలా పాలిస్తున్నాయని కూడా ప్రశ్నలు గుప్పించారు.
Next Story

